త్రివిక్రమ్ - బన్నీ కథేంటి.. హ్యాట్రిక్ కొడతారా?

Published : Nov 01, 2018, 02:56 PM ISTUpdated : Nov 01, 2018, 03:00 PM IST
త్రివిక్రమ్ - బన్నీ కథేంటి.. హ్యాట్రిక్ కొడతారా?

సారాంశం

స్టార్ దర్శకుల్లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాతో మొత్తానికి సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు. ఆ సినిమా ఎంతవరకు లాభాలను అందించిందో తెలియదు గాని కలెక్షన్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ సంగతి పక్కనపెడితే గత కొంత కాలంగా త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు.   

ఆ ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త వస్తోంది. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు చాలా బిజీగా ఉన్నాడు. అయితే బన్నీకి జోడిగా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని సెలెక్ట్ చేయనున్నారట. ఇక కథ విషయానికి వస్తే త్రివిక్రమ్ ఈ సారి తన అసలైన కామెడీని సినిమాలో చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ గత చిత్రాలు అజ్ఞాతవాసి - అరవింద సమేతలలో ఎలాంటి కామెడీతో మెప్పించలేకపోయాడు. ఆడియెన్స్ అతని నుంచి కామెడీ ఎంటర్టైనర్ ను ఎక్కువగా ఊహిస్తారని అందరికి తెలిసిందే. కానీ త్రివిక్రమ్ ఆ స్టైల్ ను చూపించి చాలా కాలమవుతోంది. అందుకే ఈ సారి ఆడియెన్స్ కావాల్సిన అన్ని అంశాలను ఈ సినిమాతో చూపించే అవకాశం ఉన్నట్లు సమాచార. 

ఇక గతంలో త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన జులాయి -   సన్ ఆఫ్ సత్యమూర్తి బాక్స్ ఆఫీస్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ క్రేజీ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.   

PREV
click me!

Recommended Stories

Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?