ఇలియానా స్టైలిష్ గెటప్!

Published : Nov 01, 2018, 02:19 PM IST
ఇలియానా స్టైలిష్ గెటప్!

సారాంశం

రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయల్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు అనౌన్స్ చేసింది. 

దీంతో హీరోయిన్ గా ఇలియానాని రంగంలోకి దింపారు. తెలుగులో హీరోయిన్ గా టాప్ రేంజ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానా ఆ తరువాత టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు అక్కడ అవకాశాలు తగ్గడంతో తెలుగులో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ఒప్పుకుంది.

దీనికి ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. టీజర్ లో ఇలియానా కనిపించినా.. పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఒకప్పుడు మాదిరి ఆమె కనిపించడం లేదని కాస్త బొద్దుగా తయారైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇలియానా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమె పోస్టర్ ని విడుదల చేసింది. కొత్త మేకోవర్ తో స్టైలిష్ గానే కనిపిస్తోంది. ఈ సినిమాతో తెలుగులో మళ్లీ బిజీ కావాలని ఆశిస్తోన్న ఇలియానా కోరిక తీరుతుందో లేదో చూడాలి!

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్