హరాస్ చేయడం పద్ధతేనా..? హీరోయిన్ ఫైర్!

By Udayavani DhuliFirst Published Sep 5, 2018, 11:49 AM IST
Highlights

టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన త్రిష ప్రస్తుతం తమిళంలో అవకాశాలు దక్కించుకుంటూ ఇప్పటికీ హీరోయిన్ గా కెరీర్ సాగిస్తుంది.

టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన త్రిష ప్రస్తుతం తమిళంలో అవకాశాలు దక్కించుకుంటూ ఇప్పటికీ హీరోయిన్ గా కెరీర్ సాగిస్తుంది. ఇటీవల రజినీకాంత్ సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. అలానే ఆమె నటించిన '96' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా కనిపించనున్నారు.

ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న సమయంలో త్రిష తన సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ''నా టైమ్ లైన్ లోకి ప్రవేశించి అగౌరవం కలిగించే మాటలు మాట్లాడతావా..? వేరొక యాక్టర్ ని తిట్టడాన్ని లాయల్టీగా భావిస్తావా..? వేరొకరిని విమర్శించడం హెరాస్ చేయడం పద్ధతేనా..?ఏమనుకుంటున్నావ్... నిన్ను బ్లాక్ చేస్తా'' అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో తమ అభిమాన తార దగ్గర గుర్తింపు పొందడానికి వేరే స్టార్లను నిందించడం నెటిజన్లకు సరదా అయిపోయింది. ఈ విషయంపై హీరోలు, హీరోయిన్లు పరోక్షంగా ఎన్ని కామెంట్లు చేస్తున్నా అభిమానులు మాత్రం తమ పంథాలోనే సాగుతున్నారు. ఒక్క త్రిష విషయంలో మాత్రమే కాదు.. చాలా మంది తారల విషయంలో ఇలానే జరుగుతుంది.

click me!