'RX100' ముద్దుగుమ్మ ఇప్పటివరకు రొమాన్స్.. ఇకపై యాక్షన్!

Published : Sep 05, 2018, 11:01 AM ISTUpdated : Sep 09, 2018, 12:42 PM IST
'RX100' ముద్దుగుమ్మ ఇప్పటివరకు రొమాన్స్.. ఇకపై యాక్షన్!

సారాంశం

'RX100' సినిమాలో హీరోయిన్ గా నటించిన నార్త్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ.. తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో నటించి ఆకట్టుకుంది

'RX100' సినిమాలో హీరోయిన్ గా నటించిన నార్త్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ.. తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో నటించి ఆకట్టుకుంది. సినిమాలో హీరోతో ఆమె రొమాంటిక్ సీన్లు, క్లైమాక్స్ లో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రేమించిన వాడిని మోసం చేసే పాత్రలో పాయల్ జీవించేసింది. ఈ సినిమా తరువాత ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇటీవల ఓ నిర్మాత తనతో తప్పుగా ప్రవర్తించాడంటూ వార్తల్లో నిలిచింది. అలాంటి విషయాలకు తాను లొంగనని, కథ నచ్చితేనే సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చింది. దానికి తగ్గట్లే తొందర పడకుండా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్ తో సినిమా చేయడానికి అంగీకరించిన పాయల్ తాజాగా దర్శకుడు భానుశంకర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు అమ్మడులో రొమాంటిక్ యాంగిల్ మాత్రమే చూశారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర భిన్నంగా ఉంటుందని సమాచారం. సినిమాలో ఆమె కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా నటిస్తుందట. సి.కళ్యాణ్ సినిమా కంటే ముందుగా భానుశంకర్ సినిమానే మొదలుపెట్టాలని భావిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు