
దాదాపుగా మూడేళ్లకు పైగా ట్రిపుల్ ఆర్ సినిమా కోసం అభిమానులు ఎదురు చూశానేజ ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజు వచ్చినట్టు ట్రిపుల్ ఆర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. అక్కడక్కడ కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ట్రిపుల్ ఆర్ చూడాలన్న ఆరాటంలో కొంత మంది ప్యాన్స్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే.. ట్రిపుల్ ఆర్ సినిమా చూస్తూ.. అనంత పురంలో ఓ అభిమాని గుండె పోటుతో మరణిస్తే.. ఈ సినిమా చూడాలన్న ఆరాటంలో రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు చిత్తూరులో మరికొం తమంది అభిమానులు.చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అభిమానుల కోసం ఆర్‌ఆర్‌ఆర్ బెన్‌ఫిట్ షో చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులోని పేర్నమ్ బట్టు నుంచి వి.కోతకు వస్తుండగా.. పాపేపల్లి వద్ద రాత్రి ఒంటి గంట సమయంలో అదుపుతప్పి రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దాంతో అక్కడికక్కడే 25 ఏళ్ల దుర్గ అనే యువకుడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు యువకులను కుప్పం హాస్పిటల్ లో మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 24 ఏళ్ల గంగాధర్, 26 ఏళ్ల వినయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. మృతి చెందిన యువకులు ముగ్గురు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.
రాత్రి ఫ్యాన్స్ షో చూసేందుకు ఉత్సహంగా బైక్ లపై వచ్చిన యువకులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకులు వీకోట మండలం బంగ్లా గ్రామం తుపాకీ వాండ్ల పల్లి కి చెందినవారని తెలుస్తోంది. ఉపాధి కోసం తమిళనాడు వెళ్లి అక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ చూడటానిక రెండు బైకుల్లో వి.కోటకు వచ్చారు నలుగురు యువకులు. నలుగురిలో ముగ్గురు మృతి చెందగా, రామకుప్పంకు చెందిన మరో యువకుడు కుప్పం పీఈఎస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ సందర్భంగా అక్కడక్కడా కొన్ని అవాంచనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.