'మోదీ బయోపిక్' కోసం ట్రైన్ పెట్టెను తగలెట్టారు

Published : Mar 04, 2019, 02:37 PM ISTUpdated : Mar 04, 2019, 02:38 PM IST
'మోదీ బయోపిక్' కోసం ట్రైన్ పెట్టెను తగలెట్టారు

సారాంశం

మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై ఒక బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ బయోపిక్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ నటిస్తున్నాడు. 

మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై ఒక బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ బయోపిక్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రాయ్ నటిస్తున్నాడు.   ‘పీఎం నరేంద్ర మోదీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కు సంభందించిన రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వడోదరాలో జరుగుతుంది. 

మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002 ఫిబ్రవరి 27న కొందరు  గోద్రా వద్ద సబర్మతి రైలులో బోగీలకు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది కరసేవకులే ఉన్నారు. దీంతో గుజరాత్‌లో అలర్లు చెలరేగాయి. ఆ అలర్లలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దీనికి సంబంధించి మోదీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ గోద్రా రైలు ప్రమాద ఘటననే మోదీ బయోపిక్‌ చిత్ర యూనిట్  తెరకెక్కిస్తుంది. ఇందుకోసం డమ్మి ట్రైన్ పెట్టిను తగల పెట్టి చిత్రీకరించినట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం మేరకు ..ఆదివారం రోజున వడోదరాలోని ప్రతాప్‌ నగర్‌, దోబి రైల్వే లైన్‌ మధ్యలో గోద్రా రైలు దహనం సీన్‌ను షూట్‌ చేశారు. పశ్చిమ రైల్వేస్‌, వడోదరా అగ్నిమాపక విభాగం అనుమతితో ఈ షూటింగ్‌ చేపట్టినట్టు నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. షూటింగ్‌ కారణంగా రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని తెలిపారు. షూటింగ్  కోసం ఉపయోగించిన బోగి పనికి రానిదని పేర్కొన్నారు.

వివేక్‌ ఒబ్‌రాయ్‌ మోదీ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సరబ్జీత్‌, మేరికోమ్‌ బయోపిక్‌లకు దర్శకత్వం వహించిన ఓమంగ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో మనోజ్‌ జోషి, బొమన్‌ ఇరానీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదల చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!