మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి అకాల మరణం

Published : May 19, 2025, 01:13 PM IST
Master Bharath mother Kamalahasini

సారాంశం

మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. భరత్ తల్లి కమల హాసిని చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దీనితో సెలబ్రిటీలు, అభిమానులు భరత్ తల్లి మృతికి సంతాపం తెలుపుతున్నారు. 

యువ నటుడు భరత్ (మాస్టర్ భరత్) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి మరణించినట్లు తెలుస్తోంది. దీంతో మాస్టర్ భరత్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి మరణంతో మాస్టర్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మాస్టర్ భరత్ అనేక చిత్రాల్లో నటించారు. 

మాస్టర్ భరత్ తల్లి కమలహాసన్ మరణానికి గుండెపోటు కారణమని తెలుస్తోంది. దీంతో సినీ ప్రముఖులు, మాస్టర్ భరత్ సన్నిహితులు అతని తల్లి మరణానికి సంతాపం తెలుపుతున్నారు. ఆమె అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని అంటున్నారు.

గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాస్టర్ భరత్ కొనసాగింది. దాదాపు 80 తెలుగు చిత్రాల్లో మాస్టర్ భరత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. వెంకీ, రెడీ, కింగ్ ఇలా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ చిత్రాల్లో మాస్టర్ భరత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

పెద్దయ్యాక మాస్టర్ భరత్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇటీవల మాస్టర్ భరత్ విశ్వం చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. పెద్దయ్యాక మాస్టర్ భరత్.. అల్లు శిరీష్ తో కలిసి నటించిన ఏబిసిడి చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సౌత్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాస్టర్ భరత్ చెరగని ముద్ర వేశారు. కొంతకాలంగా మాస్టర్ భరత్ కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అతడు తన తల్లిని కోల్పోవడం ఊహించని విషాదం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మాస్టర్ భరత్ కి ధైర్యం చేకూరాలని సెలబ్రిటీలు, అభిమానులు కోరుకుంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?