
ఒక సినిమా హిట్టైందంటే ఆ టీమ్ , ఆ సినిమాకు చేసిన స్టార్స్ అందరూ ఒక్కసారిగా బిజీ అయ్యిపోతారు. ఫెయిలైనా అదే పరిస్దితి. రీసెంట్ గా రిలీజైన రవితేజ ఖిలాడి సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆ సినిమాపై ఆశలు పెట్టుకున్న టెక్నిషియన్స్...హీరోయిన్స్ అందరి పరిస్దితి ఇబ్బందుల్లో పడింది.
రిలీజ్ కు ముందు మాస్ మహారాజా రవితేజా ఖిలాడీ సినిమాతో హీరోయిన్ డింపుల్ హయాతి సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. డింపుల్ ఇంతకు ముందు పలు సినిమాల్లో నటించినా.. ఖిలాడీ సినిమాతో ఫేమ్ లోకి వచ్చింది. దీంతో ఈ తెలుగు భామకు వరుస ఆఫర్స్ దక్కుతాయని అందరూ భావించారు. అదే సమయంలో యాక్షన్ స్టార్ హీరో గోపిచంద్ సినిమాలో డింపుల్ హయాతి ఎంపిక అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడా ఆఫర్స్ ఏమీ లేవని తెలుస్తోంది.
డింపుల్ ని తమ సినిమాలో ఎంచుకుందామన్న నిర్మాతలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి తగ్గట్టు.. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా డింపుల్ చాలా గ్లామర్ గా..చిన్న చిన్న బట్టలేసుకుని హంగామా చేసింది. లిప్ లాకులకు కూడా నో ప్లాబ్లం అనేసింది. దాంతో నిర్మాతలు హడావిడిపోయారు. రిలీజ్ అయ్యాక ఆమె డేట్స్ దొరకవేమో అని అడ్వాన్స్ లు రెడీ చేశారు. గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో హీరోయిన్ గా ముందు డింపుల్ అనే అనుకున్నారు. అయితే `ఖిలాడి` వచ్చాక, ఆ సినిమా చూసి అడ్వాన్స్ ఇచ్చి ఫైనల్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఖిలాడి విడుదలైంది.
ఈ సినిమాలో.. డింపుల్ హయత్ గ్లామర్ షోతో.. రెచ్చిపోయినప్పటికీ, నటనా పరంగా ఏమాత్రం మార్కులు పడలేదు. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఏమాత్రం బాగోకపోవడం తో మైనస్ మార్కులు పడ్డాయి. అందులోనూ సినిమా హిట్టైతే ఆ లెక్క వేరేగా ఉండేది. దాంతో ఇప్పుడు నిర్మాతలు వెనక్కి తగ్గి లైట్ తీసుకోవడం మొదలెట్టారు. గోపీచంద్ సినిమాలో మరో కొత్తమ్మాయి కోసం చిత్ర టీమ్ అన్వేషణ మొదలెట్టింది. డింపుల్ కి అడ్వాన్సు ఇవ్వబోయి.. ఖిలాడి చూశాక మనసు మార్చుకున్న లిస్ట్ పెద్దదే అంటున్నారు.