
టాలీవుడ్ సెలెబ్రెటీలకు సంబంధించిన ఎలాంటి విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ప్రేమ పెళ్ళికి సంబంధించిన విషయాలైతే క్షణాల్లో సోషల్ మీడియాలో పాకిపోతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ నిర్మాత వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
నిర్మాత హేమంత్ కుమార్ ఓ ఇంటివాడయ్యాడు. తాను సుజని అనే మహిళని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. హేమంత్ కుమార్, సుజని వివాహం కోయంబత్తూరులో ఓ గుడిలో జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం సీక్రెట్ గా జరిగింది.
వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్ర ధారణలో కనిపిస్తున్నారు. తన వివాహానికి సంబంధించిన ఫోటోలని హేమంత్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో నేను సుజని వివాహం చేసుకున్నాం. నన్ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్న సుజని ధన్యవాదాలు. ఈ యూనివర్స్ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది అని నమ్ముతున్నాను అంటూ హేమంత్ ట్వీట్ చేశారు.
అలాగే సుజని కూడా తనయూ వివాహం జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఈ బ్యానర్ లో ఓటిటి వేడుకగా పలు కార్యక్రమాలు నిర్మాణం అవుతున్నాయి.