ఆ సంఘటన నిద్రలేకుండా చేసింది.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్

By Mahesh JujjuriFirst Published Mar 16, 2023, 3:19 PM IST
Highlights

ఓ సంఘటన తనలో భయం పుట్టించింది అన్నారు నేచురల్ స్టార్ నానీ, ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా నిద్రపట్టలేదన్నారు. రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి అన్నారు నాని. ఇంతకీ నానీని భయటపెట్టిన సంఘటనేది. 

నేచురల్ స్టార్ నానీ హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదేలు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో  తెరకెక్కిన  దసరా సినిమాలో నాని కంప్లీట్ మాస్  లుక్కుతో కనిపించనున్నాడు. ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా  థియేటర్లలో సందడి చేయబోతోంది దసరా. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. నాని టీమ్ ప్రమోషన్స్ కు పదును పెట్టింది. ఫుల్  బిజీగా ఉన్నారు దసరా టీమ్. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇక  తాజా ఇంటర్వ్యూలో నేచురల్ స్టార్ కొన్ని ఇంటర్ట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. 

నాని  మాట్లాడుతూ... ఈ సినిమా షూటింగు సందర్భంగా తనని కంగారు పెట్టిన ఓ సంఘటనను గురించి మాట్లాడాడు. షూటింగ్ సందర్భంగా.. సీన్ లో  డంపర్ ట్రక్ కోల్స్ ను తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. ఆ డంపర్ ట్రక్ లో నుంచి నేను కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి ఇది సీన్. అయితే  ఈ సిన్ కోసం సింథటిక్ బొగ్గును రెడీ చేశారు.. అయితే అవి కూడా డస్ట్ తోనే నిండి ఉంటాయి. ఆ డంపర్ లో నుంచి నేను క్రింద పడిపోయాను. సింథటిక్ కోల్స్ క్రింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత  టైమ్ పడుతుంది. 

అయితే ఆ గ్యాప్ లో నేను గాలి పీల్చడం సాధ్యం అయ్యే విషయం కాదు. కాని నేను గాలి పీల్చకుండా ఉండలేను. ఒక వేళ గాలి పీల్చితే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ రకంగా నేను నరకం చూశాను.  షూటింగ్ అయిపోయిన తరువాత కూడా  అదే గుర్తుకు వచ్చి ఇబ్బంది పడ్డాను. ఈ  సీన్ షూటింగ్ అయ్యాక చాలా రోజుల పాటు.. డంప్ లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం .. బొగ్గు నాపై పడటం .. నన్ను పైకి లాగడం .. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి. లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది అన్నారు నాని. 

ఇక ఈ  ఇబ్బంది నుంచి బయట పడటానికి నాకు చాలా రోజులు పట్టింది.  అది క్లియర్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. దీని వలన దాదాను  రెండు నెలల పాటు నిద్రపట్టలేద అని అన్నారు నాని. ప్రస్తుతం నానీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నానీ ఆశలన్నీ దసరా సినిమాపైనే ఉన్నాయి. శ్యామ్ సింగరాయ తరువాత ప్లాప్ చూసిన నేచురల్ స్టార్ దసరా సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి నానీ ప్రయోగం ఫలిస్తుందా లేదా చూడాలి. 
  
 

click me!