టాలీవుడ్ జనవరి రివ్యూ..!

First Published Feb 3, 2019, 4:49 PM IST

టాలీవుడ్ జనవరి రివ్యూ..!

దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చినా.. రెండో రోజుకి సినిమా డల్ అయిపోయింది. భారీ మొత్తాలతో సినిమా హక్కులను కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. దీంతో సినిమా రెండో భాగాన్ని బయ్యర్లకు ఫ్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
undefined
తెలుగునాట ఈ సినిమా రూ.76 కోట్ల బిజినెస్ చేసింది. కానీ వసూళ్లు మాత్రం యాభై కోట్లు మాత్రమే. దాదాపు బయ్యర్లు పాతిక కోట్లు నష్టపోయినట్లు సమాచారం. 'రంగస్థలం' వంటి భారీ సక్సెస్ ఫుల్ సినిమా తరువాత చరణ్ నటించిన ఈ సినిమా అతడిని నిరాశనే మిగిల్చింది.
undefined
రజినీకాంత్ నటించిన ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ ఈ సినిమా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఎక్కువ థియేటర్లు లేక డబ్బింగ్ సినిమా కావడంతో ఈ సినిమా ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయింది.
undefined
పెద్ద సినిమాలతో పోటీ పడుతూ విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా దుమ్ము దులిపేసింది. ఈ ఒక్క సినిమాతో నిర్మాతకు ముప్పై కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి.
undefined
అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. విడుదలరోజు సినిమాకు ఏవరేజ్ టాక్ రావడంతో బయ్యర్లు రికవరీ అయిపోతారని భావించారు. కానీ ఈ సినిమా రెండో వీకెండ్ లో ముందుకు వెళ్లలేకపోవడంతో బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు.
undefined
బాలీవుడ్ లో విడుదలైన ఈ సినిమా యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందించారు. పాకిస్తాన్ పై భారత సైన్యం చేసిన దాడుల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఈ హిందీ చిత్రాన్ని బాగానే ఆదరించారు.
undefined
కంగనా నటించిన ఈ సినిమా వివాదాల నడుమ విడుదలైంది. సినిమాలో కంగనా నటన బాగున్నప్పటికీ సినిమాకి మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు కూడా లేవు.
undefined
మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.
undefined
click me!