ఎప్పటికీ గుర్తుండిపోయే టాలీవుడ్ ప్రేమ కావ్యాలు!

First Published Feb 3, 2019, 12:50 PM IST

ఎప్పటికీ గుర్తుండిపోయే టాలీవుడ్ ప్రేమ కావ్యాలు!

1953 లో వచ్చిన 'దేవదాసు' చిత్రం ఇప్పటి జెనరేషన్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరావు గారికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆ సినిమాలో పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
undefined
సినీ ప్రేమికులు ఎప్పటికీ మరువలేని అధ్బుత కావ్యం మణిరత్నం 'గీతాంజలి'. నాగార్జున నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత నాగార్జున కోసం దర్శకులు ప్రత్యేకంగా ప్రేమకథలు రూపొందించడం మొదలుపెట్టారు.
undefined
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు యూత్ మొత్తాన్ని మెప్పించిన చిత్రం 'తొలిప్రేమ'. పవన్ కెరీర్ లో 'తొలిప్రేమ' ఓ అధ్యాయమనే చెప్పాలి. ఆ కెరీర్ లో ఈ సినిమా పెద్ద మలుపు.
undefined
సిద్ధార్థ్ నటించిన ఈ క్యూట్ లవ్ స్టోరీలో జెనీలియా పాత్ర ఎప్పటికీ మర్చిపోలేము. హ హ హాసిని అంటూ ఆమె చేసిన అల్లరిని ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.
undefined
సుకుమార్ టాలీవుడ్ కి అందించిన ప్రేమకథల్లో 'ఆర్య' ఒకటి. 'ఫీల్ మై లవ్' అంటూ ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రేమ కోసం పరితపించే సన్నివేశాలు బాగా పండాయి. కథ, కథనాలు, పాటలు సినిమాలో ప్రతీ ఒక్క అంశం ఆడియన్స్ ని కట్టి పడేశాయి.
undefined
ఎమోషనల్ గా కాకుండా అల్లరిగా కూడా ప్రేమ కథలను తెరపై చూపించొచ్చని దర్శకురాలు నందిని రెడ్డి చేసిన ఈ ప్రయోగం యూత్ ని బాగానే ఆకట్టుకుంటుంది. నిత్యామీనన్, నాని కెరీర్ లకు ఈ సినిమా ఎంతగానో హెల్ప్ అయింది.
undefined
గౌతం మీనన్ క్రియేట్ చేసిన పాత్రల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేవి జెస్సీ, కార్తిక్ పాత్రలు. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి. ఈ ప్రేమకథకు రెహ్మాన్ తన మ్యూజిక్ తో ప్రాణం పోశారు.
undefined
'రన్ రాజా రన్' సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శర్వానంద్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని చూస్తే 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అనే మాస్టర్ పీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ ప్రేమకావ్యం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
undefined
ప్రేమ కొంతకాలమే బాగుంటుందని సరికొత్త లైన్ తో రూపొందించిన ఆరెంజ్' సినిమా ఫ్లాప్ అయినా.. ఇప్పటికీ చాలా మందికి ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరేట్.
undefined
నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా రూపొందించిన సినిమా ఇది. రెండు వేరు వేరు ప్రపంచాలు గల ఇద్దరు వ్యక్తులు ఎలా ఒక్కటయ్యారనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ప్రేమకథ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
undefined
నిజంగా జరిగిన కథ తెరపై ఎంతో అందంగా ఆవిష్కరించాడు కొత్త దర్శకుడు శివ నిర్వాన. ప్రేమలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదని దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని ఎంతో బాగా చూపించారు.
undefined
ప్రేమకథల్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది.
undefined
పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ని వాడుకోవడంతో సినిమా ఎలా ఉంటుందోనని భయపడ్డ ఆడియన్స్ ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. వరుణ్ తేజ్ లో రొమాంటిక్ నటుడు ఉన్నాడని నిరూపించిన సినిమా ఇది.
undefined
click me!