తెలుగు హీరోయిన్ ని మోసం చేసిన నైజీరియన్.. గుడ్డిగా నమ్మేసింది!

By tirumala ANFirst Published Jun 12, 2019, 3:09 PM IST
Highlights

చిన్న చిత్రాల్లో నటిస్తూ వర్థమాన నటిగా రాణిస్తున్న సోనాక్షి వర్మ గుర్తు తెలియని నైజీరియన్ చేతిలో మోసపోయింది. సైబర్ నేరాలు ఎక్కువవుతున్న ఈ కాలంలో సెలెబ్రిటీలు కూడా మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.

చిన్న చిత్రాల్లో నటిస్తూ వర్థమాన నటిగా రాణిస్తున్న సోనాక్షి వర్మ గుర్తు తెలియని నైజీరియన్ చేతిలో మోసపోయింది. సైబర్ నేరాలు ఎక్కువవుతున్న ఈ కాలంలో సెలెబ్రిటీలు కూడా మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. కొద్ది రోజుల పరిచయానికే అవతలి వ్యక్తులని పూర్తిగా నమ్మేస్తున్నారు. అలా నమ్మి సోనాక్షి వర్మ మోసపోయింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

గత మే నెలలో సోనాక్షివర్మ ఫేస్ బుక్ ఖాతాకు ఓ రిక్వస్ట్ వచ్చింది. మెరిన్ కిరాక్ పేరుతో ఉన్న ఆ రిక్వస్ట్ ని సోనాక్షి వర్మ యాక్సెప్ట్ చేశారు. దీనితో అతడు సోనాక్షి వర్మతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. తాను లండన్ కు చెందిన వ్యక్తిని అని,. మీతో స్నేహం చేయాలని భావిస్తున్నట్లు చెప్పడంతో సోనాక్షి వర్మ నమ్మేసింది. అలా ఫేస్ బుక్ ద్వారా బాగా దగ్గరయ్యారు. 

కొన్ని రోజుల తర్వాత తమ ఫ్రెండ్ షిప్ కు గుర్తుగా ఓ గిఫ్ట్ పంపుతున్నానని చెప్పాడు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్ లోని మీ ఇంటికి వస్తుందని తెలిపాడు. మే 27న తాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారిని అని, మెరిన్ కిరాక్ పేరుతో ఓ గిఫ్ట్ వచ్చిందని తెలిపాడు. ఆ గిఫ్ట్ ఇంటికి పంపాలంటే 85 వేలు ఖర్చవుతుందని తెలిపాడు. నమ్మేసిన సోనాక్షి వర్మ అతడు చెప్పిన బ్యాంక్ ఖాతాకు 85 వేలు జమ చేసింది. 

కానీ బాహుబలి మాత్రం ఇంటికి చేరలేదు. ఆ తర్వాత అతడికి ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తాను మోసపోయాననే విషయం సోనాక్షికి అప్పుడే అర్థంఅయింది. జరిగిన సంగతి వివరిస్తూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

click me!