నాని హీరోయిన్ పై కుర్ర హీరోల చూపు!

Published : Jun 08, 2019, 01:39 PM IST
నాని హీరోయిన్ పై కుర్ర హీరోల చూపు!

సారాంశం

టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ వస్తోందంటే ఆమెపై దృష్టి పడడం ఖాయం. పైగా క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ లో నటిస్తుందంటే ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెడతారు. 

టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ వస్తోందంటే ఆమెపై దృష్టి పడడం ఖాయం. పైగా క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ లో నటిస్తుందంటే ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెడతారు. ప్రస్తుతం నాని సరసన నటిస్తోన్న హీరోయిన్ పై మన కుర్ర హీరోల కళ్లు పడ్డాయి.

'గ్యాంగ్ లీడర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ప్రియాంకా మోహన్. ఈమె లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో తమ తదుపరి సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవాలని కొందరు హీరోలు భావిస్తున్నారు. శర్వానంద్ నుండి విజయ్ దేవరకొండ వరకు కుర్ర హీరోలంతా ప్రియాంకా గురించి ఆరా తీయడం మొదలుపెట్టారని తెలుస్తోంది.

అయితే దర్శకుడు విక్రమ్ కె కుమార్ తన హీరోయిన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. 'గ్యాంగ్ లీడర్' సినిమా విదుదలైనంత వరకూ ప్రియాంక మోహన్ మరో సినిమా సైన్ చేయడానికి వీలు లేకుండా అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ఇప్పటివరకు సినిమాలో ప్రియాంక స్టిల్ బయటకి రాలేదు.

అయితే కుర్ర హీరోలు మాత్రం ఆమె వెంట పడుతున్నారని సమాచారం. దీనికి కారణం.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరతనే చెప్పాలి. అందుకే కొత్తగా ఎవరు వచ్చినా.. కొంచెం  పేరున్నా ఆమెని తమ సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : సుమిత్రకు తెలిసిపోయిన అసలు నిజం, జ్యోత్స్న కు మొదలైన టెన్షన్..
Illu Illalu Pillalu: నిశ్చితార్థానికి ముందు అపశకునం, కుట్ర మొదలుపెట్టిన శ్రీవల్లి తల్లిదండ్రులు