Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..

Published : Aug 26, 2026, 04:18 PM IST
Pavan Sadineni

సారాంశం

Pavan Sadineni: టాలీవుడ్ లో కలకలం రేగింది.. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేనిపై ఓ నటి కంప్లైయింట్ చేయడంతో.. అతను అరెస్ట్ అయ్యాడు.

డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనను లైంగికంగా వాడుకుని మోసం చేశారంటూ ఒక సినీ నటి చేసిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాదులోని గోల్కొండ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.

ప్రేమ పేరుతో మోసం చేశాడని నటి ఫిర్యాదు

బాధిత నటి కథనం ప్రకారం.. పవన్ సాధినేని తనతో చాలా కాలంగా ప్రేమ పేరుతో సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) చేశారని తెలిసింది. త్వరలోనే వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి, ఆ తర్వాత మాట దాటేస్తూ మోసానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఆరోపణలను నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ఆయనకు 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది.

పవన్ సాధినేని సినిమాలు..

‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమైన పవన్ సాధినేని, ఆ తర్వాత ‘సావిత్రి’, ‘సేనాపతి’ వంటి చిత్రాలతో పాటు పలు విజయవంతమైన ఓటీటీ వెబ్ సిరీస్‌లను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘ఆకాశంలో ఒక తార’ అనే బిగ్ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. సినిమా కెరీర్‌లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో, ఇలా లైంగిక వేధింపుల కేసులో ఆయన చిక్కుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?