Kareena Kapoor: 45 ఏళ్ల వయసులో కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంటా..? జిమ్ వీడియోతో మొదలైన కొత్త చర్చ

Published : Aug 22, 2026, 07:16 PM IST
Kareena Kapoor Pregnancy Rumors

సారాంశం

Kareena Kapoor: జిమ్ నుంచి బయటకు వస్తున్న కరీనా కపూర్ వీడియో ఒకటి వైరల్ కావడంతో, ఆమె మూడోసారి గర్భవతి అయి ఉండొచ్చని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. వీడియోలో ఆమె బేబీ బంప్ కనిపిస్తోందని, సెక్యూరిటీ ఆమెకు ప్రత్యేక రక్షణ ఇవ్వడమే ఈ చర్చకు కారణమైంది.

బాలీవుడ్ క్యూట్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జిమ్ నుంచి బయటకు వస్తున్న 45 ఏళ్ల నటి కరీనా కపూర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన అభిమానులు "కరీనా మూడోసారి గర్భవతి అయ్యారా?" అంటూ కొత్త చర్చకు తెరలేపారు.

వైరల్ వీడియోలో ఏముంది?

వైరల్ అవుతున్న వీడియోలో కరీనా కపూర్ జిమ్ నుంచి బయటకు రావడం కనిపిస్తుంది. సన్‌గ్లాసెస్ పెట్టుకుని, చేతిలో వాటర్ టంబ్లర్‌తో కారు వైపు నడుస్తున్న కరీనాకు ఆమె సెక్యూరిటీ సిబ్బంది గొడుగు పట్టి రక్షణ ఇచ్చారు. ఆమె కారు ఎక్కుతున్నప్పుడు, సెక్యూరిటీ సిబ్బంది ఆమె నడుము భాగానికి చేయి అడ్డుపెట్టి, ఆమె చుట్టూ రక్షణ కవచంలా నిలబడటం కనిపించింది.

దీన్ని గమనించిన అభిమానులు, నెటిజన్లు కరీనాకు బేబీ బంప్ కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. "కరీనా మళ్లీ గర్భవతా?", "సైఫ్-కరీనా ఇంట్లోకి మూడో బిడ్డ రాబోతోందా?" అంటూ ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే, ఈ పుకార్లపై కరీనా కపూర్ గానీ, సైఫ్ అలీ ఖాన్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

సైఫ్ - కరీనా ప్రేమ, పెళ్లి:

బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ జంటల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 'తషాన్' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. సుమారు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట, అక్టోబర్ 16, 2012న ముంబైలోని బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

పెళ్లి రిజిస్ట్రేషన్ సమయంలో కరీనా తల్లిదండ్రులు రణధీర్ కపూర్, బబితాతో పాటు సైఫ్ తల్లి, సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ కూడా ఉన్నారు. ఈ పెళ్లి వేడుకలో కరీనా తన అత్తగారైన షర్మిలా ఠాగూర్ కుటుంబానికి చెందిన సాంప్రదాయ 'ఘరారా' డ్రెస్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ డిజైన్ చేసిన 'అచ్కన్' ధరించారు.

సైఫ్-కరీనా కుటుంబం:

ప్రస్తుతం సైఫ్, కరీనా దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ (జెహ్) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కరీనాకు ఇది మొదటి వివాహం కాగా, సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో పెళ్లి. సైఫ్ మొదటి భార్య నటి అమృతా సింగ్. వారికి బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, నటుడు ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ ఇదే, ఆ స్టార్‌ హీరో కూడా యాక్సిడెంట్‌లోనే మరణం.. ఆయనెవరంటే?