130ఏళ్లయినా చెక్కుచెదరని డెడ్ బాడీ.. రిలీజ్ కు సిద్దమైన నిజమైన కథ

By Prashanth MFirst Published Aug 24, 2019, 12:17 PM IST
Highlights

బెర్నదత్ అనే 14 సంవత్సరాల బాలిక మరణించిన  130 సంవత్సరాలు అయినా ఇప్పటికి ఆమె మృత దేహం చెక్కు చెదర కుండా ఉన్న ఘటన ప్రపంచాన్ని నిత్యం ఆశ్యర్యపరుస్తూనే ఉంటుంది. మేరీమాత దర్శనం వల్లే ఆమె అలా బౌతికంగా ఉన్నారని చెబుతుంటారు.

బెర్నదత్ అనే 14 సంవత్సరాల బాలిక మరణించిన  130 సంవత్సరాలు అయినా ఇప్పటికి ఆమె మృత దేహం చెక్కు చెదర కుండా ఉన్న ఘటన ప్రపంచాన్ని నిత్యం ఆశ్యర్యపరుస్తూనే ఉంటుంది. మేరీమాత దర్శనం వల్లే ఆమె అలా బౌతికంగా ఉన్నారని చెబుతుంటారు. అలాంటి ఘటనను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఫ్రాన్స్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన  ''అవర్ లేడి ఆఫ్ లూర్డ్స్"  అనే సినిమాలో  ఇంగ్లీష్,,తమిళ్,మలయాళ,ఫ్రెంచ్ భాషల్లో సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఆజ్ఞా నోయిక్స్, అంజన, పి.కమలాకర రావు, డేవిడ్ హార్ట్ ప్రాధాన పాత్రలో నటించిన ఈ సినిమాను శ్రీ ప్రియ ఇంటర్నేషనల్ బ్యానర్ లో పి.కమలాకరరావు నిర్మించారు.  

సినిమాను విడుదల చేస్తున్న సందర్బంగా హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఫాదర్ Rev. Msgr. స్వర్ణ బెర్నార్డ్ వికార్ జనరల్ గారు,చిత్ర నిర్మాత పి.కమలాకరరావు, భాగ్యనాధన్, మార్టిన్ మైఖేల్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లూర్థు ని లక్షల మంది భక్తులు సందర్శించు కుంటారు. ఒక మంచి ఉద్దేశం తో తీసిన ఈ సినిమా అందరూ చూడవలసింది. ఈ సినిమాకు పని చేసిన అందరికి అల్ డి బెస్ట్ అని ఫాదర్ స్వర్ణ బెర్నార్డ్ వికార్ అన్నారు.

click me!