‘మనిషిని మనిషిగా ప్రేమించే వ్యక్తి’.. చంద్రమోహన్ కు సీఎం, చిరు, పవన్, ఎన్టీఆర్, సెలబ్రెటీల నివాళులు..

Published : Nov 11, 2023, 02:59 PM IST
‘మనిషిని మనిషిగా ప్రేమించే వ్యక్తి’.. చంద్రమోహన్ కు సీఎం, చిరు, పవన్, ఎన్టీఆర్, సెలబ్రెటీల నివాళులు..

సారాంశం

ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్ తారలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మృతికి సీఎం కేసీఆర్ తో పాటు సెలబ్రెటీలు సెలబ్రెటీలు నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.   

ముందుగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నివాళి అర్పిస్తూ..  తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని ఆయన విచారం వ్యక్తం చేశారు. వారి స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని., కళామతల్లి ముద్దుబిడ్డ గా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని  చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని సీఎం తెలిపారు. 

మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)  స్పందిస్తూ.. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక  ఆణిముత్యాల్లాంటి  చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా  తెలుగు  వారి  మనస్సులో చెరగని ముద్ర  వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని  తెలవడం ఎంతో  విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో  ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప  అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి  శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ  సభ్యులకు , అభిమానులకు నా  ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. అంటూ స్పందించారు. 

అలాగే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). బాలకృష్ణ, ఎన్టీఆర్, మంచు విష్ణు చంద్రమోహన్ మృతికి నివాళి అర్పించారు. 

 

స్థాయి ని బట్టి కాకుండా, మనిషిని...మనిషిగా ప్రేమించిన వ్యక్తి చంద్రమోహన్...ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి హుందా గా ఉంటూ...చిత్ర పరిశ్రమలో అజాత శత్రువు గా పేరు  తెచ్చుకున్నారు... ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది... చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. అంటూ పోసాని కృష్ణ మురళి (AP FDC Chairman) ప్రకటన విడుదల చేశారు. 

 

అలాగే చంద్రమోహన్ కు నివాళి అర్పిస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని టాలీవుడ్ తారలు పంచుకున్నారు. నాని, వెంకటేశ్ దగ్గుబాటి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మంచు విష్ణు, దర్శకుడు మారుతి, ఆది శంకర్ చంద్రమోహన్ మృతికి చింతించారు. ఆయనకు సోషల్ మీడియా వేదిక నివాళి అర్పిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే