
టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలిసిందే. సినిమాల్లో అమ్మ, వదిన, అక్కగా ఎంత అద్భుతంగా నటిస్తుందో.. బయట అంత హాట్ గా ఉంటుంది. హాట్ హాట్ సోషల్ మీడియా వీడియోస్ తో సందడి చేస్తుంది. ఇక ఆమెనుంచి ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కనిపించేది ఫిట్నెస్. ఆమె ఫిట్ నెస్ కు ఎంత ప్రియారిటీ ఇస్తారో మనకు తెలిసిందే. నిత్యం వర్కౌట్లతో జిమ్ లో ఆమె ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. షూటింగ్ లు లేకపోతే జిమ్ లో ఎక్కువగా గడిపే ప్రగతి నేషనల్ లెవల్ లో తన సత్తా ఏంటో చూపించారు.
ప్రగతి తన సోషల్ మీడియా వీడియోస్ కోసం, ఫిట్ నెస్ ను మెయింటేన్ చేయడం కోసం.. ఏదో హోమ్ వర్కౌట్లు చేస్తుంది అనుకున్నారు. అంత వరకే మనకు తెలిసింది. అయితే, తాజాగా ఆమె సాధించిన గొప్ప విజయం చూసి.. అంతా నోరెళ్ళబెట్టారు. ఆమె సరదాకు చేస్తుంది అనుకున్న వెయిట్ లిఫ్టింగ్, జిమ్ చాలా సీరియస్ గా తీసుకుంది. అంతే కాదు పోటీలకు కూడా సై అంది. జాతీయ స్థాయికి వెళ్ళింది. నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి వార్తల్లో నిలిచింది.
ఇటీవల బెంగళూరులో 28వ పురుషులు, మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రగతి మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు. ఈ పోటీలకు బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా నిలిచింది. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించడం విశేషం. ప్రస్తుతం ప్రగతి అనేక సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న 'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ త్వరలోనే ప్రసారం కానుంది.
నిజానికి ప్రగతి రీల్ క్యారెక్టర్స్ కు పూర్తి విరుద్ధంగా రియల్ లైఫ్ ఉంటుంది. తమిళ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టిన ప్రగతి, సుమారు 10 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంది. ఆ తారువాత వరుసగా సీరియల్స్ చేసిన ప్రగతి.. బాబీ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ చూసింది. సినిమాలో చాలా కూల్ గా, సంప్రదాయ బద్దంగా కనిపించినా, బయట మాత్రం ఈమె డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ప్రవర్తిస్తుంది. జిమ్ నుంచి మొదలు కొని ఇంట్లో చేసే డ్యాన్స్ వరకు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది.