టాలీవుడ్‌లో విషాదం: కరోనాతో హాస్యనటుడు మృతి

Siva Kodati |  
Published : Sep 23, 2020, 11:20 PM IST
టాలీవుడ్‌లో విషాదం: కరోనాతో హాస్యనటుడు మృతి

సారాంశం

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్‌తో ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్‌తో ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.

దీంతో బుధవారం ఆయన కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు.

మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
MS Subbulakshmi Biopic: దేశంలో తొలి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఆమే.. కమల్ హాసన్ కామెంట్స్