ఆ సినిమా చూసి ఆడవాళ్ళు కొట్టడానికి వచ్చారు, తనికెళ్ళ భరణి కామెంట్స్ వైరల్.

Published : Aug 04, 2023, 07:36 PM ISTUpdated : Aug 04, 2023, 07:39 PM IST
ఆ సినిమా చూసి ఆడవాళ్ళు కొట్టడానికి వచ్చారు, తనికెళ్ళ భరణి కామెంట్స్ వైరల్.

సారాంశం

మూడు దశాబ్ధాలుగా తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా దూసుకుపోతున్నాడు తనికెళ్ల భరణి. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్న తనికెళ్ళ భరని...తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.   

దాదాపు 30 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో వెలుగు వెలుగుతున్నారు తనికెళ్ళ భరణి. రైటర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి.. నటుడిగా ఎన్నో పాత్రలకు జీవం పోసి.. దర్శకుడిగా, రచయితగా తన ప్రత్యేకతను చాటుకున్నారు తనికెళ్ల భరణి. ముఖ్యంగా కెరీర్ మొదట్లో ఆయన విలన్ గా చేసిన పాత్రలు భయంకరంగా ఉండేవి. కృరత్వం ఆయన యాక్టింగ్ లో తాండవించేది. అంతలా పాత్రలో ఇన్వాల్వ్ అయ్యేవారు తనికెళ్ళ భరణి. 

సినిమాలలో ఎప్పుడు విలన్ గా నటించే తనికెళ్ల భరణి బయట మాత్రం చాలా  మృదు స్వభావి. ప్రస్తుతం సినిమాలు చాలా వరకూ తగ్గించేశారు స్టార్ యాక్టర్. అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన చేసిన పాత్రల ప్రభావం బయట కూడా బాగా కనిపించేదని అంటున్నారు. పాజిటీవ్ చేసినా.. నెగెటీవ్ చేసినా.. బయట కనిపించగానే వారి పలకరింపులోనే తెలుస్తుంది అంటున్నారు. ఈక్రమంలో ఆయన ఓసారి ఓ సందర్భం గురించి వివరించారు. మాతృదేవోభవ సినిమా లో తనికెళ్ల భరణి హీరోయిన్ ని ఏడిపించే అతి క్రూరమైన కిరాతకమైన విలన్ పాత్రలో నటించారు. 

ఈ సినిమా ఆ టైమ్ లో సూపర్ హిట్ అయ్యింది. భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎక్కడ చూసిన మాతృదేవో భవ గురించే డిస్కర్షన్.. ఆ సినిమాలో పాట కూడా బాగా పాపులర్ అయ్యింది. ఈసినిమా చూడటానికి  ఏ థియేటర్ లో చూసినా.. మహిళా ప్రేక్షకుల క్యూలు బారులు కట్టారంటే.. ఈసినిమా ప్రభావం ఎంతలా ఉండేదో అర్ధం అవుతుంది. ఈక్రమంలో విలన్ పాత్ర చేసిన తనికెళ్ళ భరణి పై మహిళలు కొంత మంది కోపం పెంచుకున్నారట. 
 
అయితే ఈ సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత తనికెళ్ల భరణి ఒకసారి బయటకి రాగా మహిళలు ఆయనను అదే పాత్రలో ఊహించుకొని కొట్టడానికి వెళ్లారట. దీన్ని బట్టి చూస్తే తనికెళ్ల భరణి తనకు ఇచ్చిన పాత్రలకు ఏ విధంగా న్యాయం చేస్తారో మనకు అర్థమవుతుంది. అంతలా ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారు తనికెళ్ల భరణి.

PREV
click me!

Recommended Stories

Toxic : యష్ అభిమానులకు షాక్! టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా? అసలు నిజం ఇదే!
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..