Samuthirakani : రామ్ చరణ్ కొడుకులాంటి వాడు.. అల్లు అర్జున్ బంగారం.. సముద్రఖని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

By Asianet News  |  First Published Aug 4, 2023, 5:54 PM IST

తమిళ దర్శకుడు, స్టార్ నటుడు సముద్రఖని (Samuthirakani) తాజాగా  రామ్ చరణ్,  అల్లు అర్జున్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వారితో అనుబంధాన్ని పంచుకున్నారు. 
 


దర్శకుడిగా, నటుడిగా సముద్రఖని కోలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నోసినిమాల్లో నటించిన ప్రేక్షకులను హృదయాలను దోచుకున్నారు. తన దర్శక ప్రతిభతోనూ మెప్పించారు. మరోవైపు తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో మొదటిసారిగా తెలుగు హీరోలను కూడా డైరెక్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘వినోదయ సీతమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ ను సరికొత్తగా వెండితెరపై ప్రజెంట్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. సినిమా సక్సెస్ టాక్ ను దక్కించుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇందుకు సముద్రఖనిని కూడా అభిమానులు, ప్రేక్షకులు అభినందిస్తున్నారు. మంచి సినిమాకు అందించినందుకు సంతోషిస్తున్నారు. 

Latest Videos

undefined

సినిమా సక్సెస్ కావడంతో సముద్రఖని ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan),  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సముద్రఖని మాట్లాడుతూ.. రామ్ చరణ్ తో ‘ఆర్ఆర్ఆర్’లో నటించాను. చెర్రీ నన్ను బాబాయ్ అని పిలుస్తాడు. ఆ సినిమా సమయంలో మంచి  ఫ్రెండ్స్ అయ్యాం. చరణ్ ను నా సొంత కొడుకులా భావిస్తాను. క్లీంకార పుట్టినప్పుడు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’లో చరణ్ తో మళ్లీ నటిస్తున్నాను. నా పాత్ర చరణ్ పాత్రకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది.  అని చెప్పారు. 

ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. బన్నీతో ‘అలా వైకుంఠపురంలో’లో చేశాను. అల్లు అర్జున్ ను నేను అన్బు అర్జున్ అంటూ పిలుస్తాను. అన్బు అంటే ప్రేమ అని అర్థం. అర్జున్ కూడా అందరీతో చాలా ప్రేమగా ఉంటారు. అందుకే అలా పిలుస్తాను. ఇక షూటింగ్ సమయంలో మాత్రం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. బంగారం లాంటి మనసున్న వ్యక్తి అల్లు అర్జున్... అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సముద్రఖని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Samuthirakani Garu About Our 😍 Lo Rc Ki Babai Ante 💥 pic.twitter.com/4o8W7AAnpi

— CharanPravi ❤️ (@IMPravallikaM17)
click me!