టోక్యో ఒలంపిక్స్: భారత క్రీడాకారులకు మెగా హీరోల బెస్ట్ విషెస్

Published : Jul 24, 2021, 12:23 PM IST
టోక్యో ఒలంపిక్స్: భారత క్రీడాకారులకు మెగా హీరోల బెస్ట్ విషెస్

సారాంశం

మెగా హీరోలైన చిరంజీవి, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా భారత క్రీడాకారులు బెస్ట్ విషెష్ తెలియజేశారు.

జపాన్ దేశ రాజధాని టోక్యో వేదికగా ప్రపంచ క్రీడా సమరం ఒలంపిక్స్ 2020 మొదలైంది. నేటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు కలల ఒలంపిక్స్  పతకం కోసం పోరాడనున్నారు. క్రీడల్లో విజయం సాధించి క్రీడాకారులు తమ దేశ జాతీయ జండాను ఒలంపిక్స్ వేదికపై రెపరెపలాడించనున్నారు. కాగా భారత్ నుండి ఈసారి మొత్తం 127మంది క్రీడాకారులు వివిధ విభాగాలలో పోటీపడుతున్నారు. భారత క్రీడాకారులు ఒలింపిక్స్ లో సత్తా చాటి దేశానికి మెడల్స్ తేవాలని భారతీయులు కోరుకుంటున్నారు. 


భారత క్రీడాకారులకు సప్పోర్ట్ గా దేశ ప్రజలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. మెగా హీరోలైన చిరంజీవి, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా భారత క్రీడాకారులు బెస్ట్ విషెష్ తెలియజేశారు.

 
''టోక్యోలో ప్రారంభమైన విశ్వక్రీడోత్సవం ఒలంపిక్స్ లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు! భారత క్రీడాకారులందరూ తమ సహజ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి దేశానికి గర్వకారణం కావాలని కోరుకొంటున్నాను'' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 


మన భారత క్రీడాకారులు టోక్యో ఒలంపిక్స్ లో విజయం సాధిస్తే చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నాను. భారత క్రీడాకారులు నా బెస్ట్ విషెష్, గుడ్ లక్ అంటూ ట్వీట్ చేశాడు మరో మెగా హీరో ధరమ్ తేజ్. 


ఏళ్లుగా రక్తం, చెమటలు చిందించి కలల పతకం కోసం ఎదురుచూస్తున్న భారత క్రీడాకారులకు మద్దతుగా నిలుద్దాం, అంటూ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు వరుణ్ తేజ్ బెస్ట్ విషెష్ తెలియజేశారు. వరుణ్ లేటెస్ట్ మూవీ గనిలో వరుణ్ బాక్సర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్