కన్ఫర్మ్.. ప్రేమలో పడ్డ త్రిష.. ఎవరా వ్యక్తి!

By Siva KodatiFirst Published May 27, 2019, 2:41 PM IST
Highlights

చెన్నై చిన్నది త్రిష ప్రేమలో పడింది.  త్రిషనే పరోక్షంగా ఖరారు చేసింది. త్రిష దశాబ్దానికి పైగా సౌత్ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేస్తోంది. ఓ సందర్భంలో త్రిష టాలీవుడ్  నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం త్రిష కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు, లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. 

చెన్నై చిన్నది త్రిష ప్రేమలో పడింది.  త్రిషనే పరోక్షంగా ఖరారు చేసింది. త్రిష దశాబ్దానికి పైగా సౌత్ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేస్తోంది. ఓ సందర్భంలో త్రిష టాలీవుడ్  నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం త్రిష కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు, లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకున్నా తమిళంలో మాత్రం విజయాలు అందుకుంటోంది. 

ఇదిలా ఉండగా త్రిష సోషల్ మీడియాలో అభిమానులతో జరిగిన చిట్ చాట్ లో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. విజయ్ సేతుపతి సరసన నటించిన 96 చిత్రం ఘనవిజయం సంధించింది. ఈ చిత్రంతో త్రిష కెరీర్ జోరందుకుంది. ప్రస్తుతం త్రిష రాంగి అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ కథ అందిస్తున్నారు. శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల రాంగి చిత్ర ఫస్ట్ లుక్  పోస్టర్ ని త్రిష సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ సంధర్భంగా త్రిష అభిమానులతో సరదాగా ముచ్చటించింది. 

ఓ అభిమాని ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉన్నారా అని ప్రశ్నించగా త్రిష ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఎలాంటి రిలేషన్స్ లేవు. కానీ ఓ వ్యక్తి నుంచి ప్ప్రేమని పొందుతున్నా అంటూ త్రిష చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనితో త్రిష ఎవరితోనో ప్రేమలో ఉందనే అభిమానులు నిర్దారణకు వస్తున్నారు. 

2015లోనే త్రిష వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలని భావించింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల త్రిష నిశ్చితార్థం రద్దయింది. గతంలో త్రిష టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో డేటింగ్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఆ మధ్యన త్రిష రానా గురించి మాట్లాడుతూ అతడు 'లేడీస్ మాన్' అనే రొమాంటిక్ కామెంట్ కూడా చేసింది.   

click me!