టిల్లన్నకి అయినా బుద్ధి రాలే, పోరీ దెబ్బకి ఈసారి రచ్చ రచ్చ.. లిరికల్ వీడియోలో ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేశారుగా

Published : Jul 26, 2023, 05:28 PM ISTUpdated : Jul 26, 2023, 05:29 PM IST
టిల్లన్నకి అయినా బుద్ధి రాలే, పోరీ దెబ్బకి ఈసారి రచ్చ రచ్చ.. లిరికల్ వీడియోలో ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేశారుగా

సారాంశం

హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు చిత్రంతో సరికొత్త క్రేజ్ సొంతం చేసుకున్నాడు. డీజే టిల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దీనితో సిద్దు ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు.

హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు చిత్రంతో సరికొత్త క్రేజ్ సొంతం చేసుకున్నాడు. డీజే టిల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దీనితో సిద్దు ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఆల్రెడీ టిల్లు స్క్వేర్ అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. 

అయితే సీక్వెల్ విషయంలో మొదటి నుంచి వివాదాలు, రూమర్స్ తెరపైకి వస్తూనే ఉన్నాయి. డీజే టిల్లు చిత్రం విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఇప్పుడు సీక్వెల్ కి అతడు డైరెక్టర్ కాదు. మాలిక్ రామ్ అనే దర్శకుడు సీక్వెల్ లోకి ఎంటర్ అయ్యారు. హీరోయిన్ విషయంలో కూడా చాలా హంగామా జరిగింది. చివరకు అనుపమ పరమేశ్వరన్ ఫైనల్ అయింది. 

వివాదాలన్నీ పక్కన పెట్టి తన రచ్చ షురూ చేశాడు టిల్లు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో వచ్చేసింది. 'టిల్లన్న ఇలాగైతే ఎలాగన్న' అంటూ సాగే ఫస్ట్ సాంగ్ మంచి మాస్ బీట్ తో అదిరిపోయింది. యువత ఎంజాయ్ చేసే విధంగా ఈ పాటని తీర్చి దిద్దారు. 

ఈ చిత్రానికి యువ దర్శకుడు రామ్ మిర్యాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ ఫస్ట్ సాంగ్ ని రామ్ మిర్యాల కంపోజ్ చేసి పాడారు. రామ్ మిర్యాల గాత్రం మరోసారి మ్యాజిక్ చేసే విధంగా ఉంది. ఈ సాంగ్ కి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. టిల్లు పాత్ర గురించి ఫన్నీగా ఆయన రాసిన లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. 'టిల్లన్నా ఇలాగైతే ఇలాగన్నా.. స్టోరీ మళ్ళీ రిపీటేనా.. పోరి దెబ్బకు తానా తందానా' అంటూ కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ ఇచ్చారు. వాటిని అంతే అద్భుతంగా రామ్ మిర్యాల పాడారు. 

పోయినసారి పోరి దెబ్బకి ఎంత గొడవైంది.. అయినా టిల్లుగానికి బుద్ది రాలేదు.. ఇప్పుడు మరో పోరీ( అనుపమ) వెంట పడుతున్నాడు. ఇప్పుడేమవుతుందో అని అర్థం వచ్చేలా లిరికల్ వీడియో రూపందించారు. అనుపమ వల్ల టిల్లు మరోసారి బోల్తా పడబోతున్నాడు.. ఇదే స్టోరీ లైన్ అంటూ లిరికల్ వీడియోతో అనిపిస్తోంది. కాకపోతే రచ్చ ఈసారి ఇంకాస్త ఎక్కువగా ఉండనుంది. 

టిల్లు స్క్వేర్ చిత్రం డీజే టిల్లుకి మించి సరికొత్త వినోదాన్ని అందించబోతుందని స్పష్టమవుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. సాంగ్ ప్రోమోలో ఆమె లుక్ మరియు టిల్లుతో ఆమె సంభాషణ వైరల్‌గా మారాయి. మొత్తానికి ఈ పాట టిల్లు స్క్వేర్ పై ఇప్పటికే ఏర్పడిన అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలునిర్వహిస్తున్నారు. టిల్లు స్క్వేర్‌ కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తారు.

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు