మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ మూవీ డిలే అంటూ రూమర్లు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ అప్డేట్స్ ఇస్తూ రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేశారు.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. సరికొత్త ప్రాజెక్ట్స్ తో యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దుమ్ములేపుతున్నారు. ఇటీవల వరుసగా హిట్లు అందుకుంటూ మాస్ సత్తా చూపిస్తున్నారు. చివరిగా ‘వాల్తేరు వీరయ్య’తో అలరించారు. ఆ తర్వాత క్రైమ్ బేస్డ్ మూవీ ‘రావణసుర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రస్తుతం మాస్ మాహారాజా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’తో రాబోతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసింది యూనిట్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి. త్వరలో సినిమాకు సంబంధించి అప్డేట్స్ అందనున్నాయి. ఇప్పటికే వచ్చని ప్రమోషనల్ మెటీరియల్ అదిరిపోయింది.
ఇక కొద్దిరోజులుగా ఈ సినిమా వాయిదా పడబోతుందంటూ రూమర్లు వస్తున్నాయి. దీనిపై తాజాగా మేకర్స్ అధికారిక ప్రటకన చేశారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దసరాకు అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేశామని తెలిపారు. అయితే సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టైగర్ నాగేశ్వరరావు విడుదలలో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు మేకర్స్. కొందరు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని, వాటి వాస్తవలం లేదన్నారు. అలాగే సినిమాకు థియేట్రికల్ పరంగా, వివిధ వాటాదారుల నుండి మొదటి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పారు.
గతంలో రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జ్ (గోదావరి)పై ఫస్ట్-లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోను లాంచ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. మేకర్స్ సినిమా ప్రమోషన్‌లను సరికొత్తగా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు వంశీ ఒక విన్నింగ్ స్క్రిప్ట్‌ని ఎంచుకున్నారు. దానిని ఆకట్టుకునే రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ సినిమాటోగ్రఫీ ఆర్ మదీ ఐఎస్‌సి వర్క్ చేస్తున్నారు. సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. మూవీలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
🥷 HUNTING IN CINEMAS WORLDWIDE FROM OCTOBER 20TH 🔥 pic.twitter.com/J7vQwUknGY
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl)