డిజాస్టర్‌ దిశగా `టైగర్‌ నాగేశ్వరరావు`.. బిజినెస్‌ ఎంత? రెండు రోజుల్లో వచ్చిందేంతా?

By Aithagoni Raju  |  First Published Oct 22, 2023, 1:26 PM IST

రవితేజ నటించిన `టైగర్‌ నాగేశ్వరరావు` దసరా విన్నర్‌ అంటూ ఊదరగొడుతున్నారు. కానీ కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. డబ్బింగ్‌ మూవీ `లియో` కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 


మాస్‌ మహారాజా రవితేజ హీరోగా `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రం వచ్చి థియేటర్లలో రన్‌ అవుతుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందించారు. వంశీ రూపొందించారు. ఈ చిత్ర శుక్రవారం విడుదలై నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. 

సినిమాలో యాక్షన్‌ ఎపిసోడ్స్, రవితేజ క్యారెక్టరైజేష్‌ తప్ప మరేదీ ఆకట్టుకునేలా లేదని అంటున్నారు. సినిమాలో ఏమాత్రం డ్రామా పండలేదని, ఎమోషన్‌ క్యారీ కాలేదని, ప్రధానంగా కాన్ల్ఫిక్ట్ మిస్‌ అయ్యిందని అంటున్నారు. డైరెక్షన్‌ ఫెయిల్యూర్‌గా చెబుతున్నారు. దీనికితోడు మూడుగంటల నిడివి ఉండటం కూడా పెద్ద మైనస్‌. ఈ నేపథ్యంలో సినిమాలో భారీగా కోత పెట్టారు. దాదాపు 25 నిమిషాలు కట్‌ చేశారు. రెండు గంటల 37 నిమిషాలు చేశారు. అంతకు ముందు మూడు గంటలు ఉంది. 

Latest Videos

ఇక ఈ సినిమా దసరా విన్నర్‌ అంటూ టీమ్‌ సెలబ్రేషన్‌ చేస్తుంది. పెద్ద ప్రెస్‌ మీట్‌ కూడా ఏర్పాటు చేసి ఊదరగొడుతున్నారు. కానీ కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. రవితేజ స్టార్‌ ఇమేజ్‌కి, మార్కెట్‌ ఏంటి? పాన్‌ ఇండియా రిలీజ్‌కి, వచ్చిన కలెక్షన్లు పొంతన లేదు. మొదటి రోజు ఈ సినిమా తొమ్మిది కోట్లు కలెక్షన్ల గ్రాస్‌ చేసింది. ఐదున్నర కోట్ల నెట్‌ సాధించింది. ఇక రెండో రోజు సగానికి పడిపోయింది. ఐదు కోట్ల గ్రాస్‌ చేసింది. రెండున్నర నుంచి మూడు కోట్ల షేర్‌ సాధించింది. 

`టైగర్‌ నాగేశ్వరరావు` థియేట్రికల్‌ బిజినెస్‌.. 39కోట్లు. నిజాంలో ఎనిమిదన్నర కోట్లు, సీడెడ్‌లో ఐదున్నర కోట్లు, ఆంధ్రాలో 17కోట్లు, ఇతర ఇండియాలో నాలుగు కోట్లు, ఓవర్సీస్‌లో మూడు కోట్ల బిజినెస్‌ అయ్యింది. కానీ రెండు రోజుల్లో ఇది 14కోట్ల గ్రాస్‌, ఎనిమిది కోట్ల నెట్‌ సాధించింది. అంటే ఇంకా ఈ చిత్రానికి 31కోట్ల షేర్‌ రాబట్టాలి. అంటే సుమారు 65కోట్లు రాబట్టాలి. ఎంత చేసిన ఆదివారం, సోమవారమే, మహా అయితే మంగళవారం కొంత సందడి ఉండొచ్చు. ఆ తర్వాత పూర్తిగా పడిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే మరో పది కోట్లు చేస్తే గగనంగా చెబుతున్నారు. 

ఈ లెక్కన `టైగర్‌ నాగేశ్వరరావు` డిజాస్టర్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సుమారు 20-25కోట్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేర్‌ వీరయ్య`తో హిట్‌ అందుకున్నారు రవితేజ. ఇందులో చిరంజీవితో కలిసి నటించారు. ఆ మధ్య `రావణాసుర` చిత్రంతో వచ్చారు. ఇది డిజాస్టర్‌ అయ్యింది. ఇప్పుడు `టైగర్‌ నాగేశ్వరరావు` రూపంలో మరో ఫ్లాప్‌ పడటం విచారకరం. ఈ సినిమా కంటే డబ్బింగ్‌ మూవీ `లియో` కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. అది ముప్పై కోట్లకుపైగానే వసూలు చేయడం విశేషం.

click me!