పులితో అనిరుద్.. బలే ఇరికించారు!

Published : Feb 21, 2019, 07:26 PM ISTUpdated : Feb 21, 2019, 07:27 PM IST
పులితో అనిరుద్.. బలే ఇరికించారు!

సారాంశం

కోలీవుడ్ యంగ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ మొదటి సారి డిఫరెంట్ సినిమాకు వర్క్ చేయబోతున్నాడు. సహాయ దర్శకుడిగా పలు తమిళ సినిమాలకు వర్క్ చేసిన హరీష్ కుమార్ ఎల్ఎచ్ తెరకెక్కించబోయే ఒక ఫన్నీ ఫాంటసీ ఫిల్మ్ కు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

స్పెషల్ గా అనిరుద్ ఈ సినిమా స్థాయిని పెంచేలా ప్రమోషనల్ వీడియోలో కనిపించాడు. అందులో టైగర్ వద్ద అనిరుద్ ని ఇరికించినట్లు చాలా ఫన్నీగా  తెరకెక్కించారు. తుంబా అని టైటిల్ సెట్ చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. 

అందుకే తెలుగులో కూడా ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. టైగర్ పాత్ర చుట్టూ కథ నడుస్తుందట. ఒక మంచి సోషల్ మెస్సేజ్ తో సినిమాను ఫన్నీ ఫాంటసీగా డిజైన్ చేస్తున్నారు. ఒక గంటపాటు నడిచే vfx ఎపిసోడ్స్ ఆడియెన్స్ ని తప్పకుండా ఆకర్షిస్తాయని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!
Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్