పాపం.. రకుల్ ని తీసేశారట!

Published : Feb 21, 2019, 04:55 PM IST
పాపం.. రకుల్ ని తీసేశారట!

సారాంశం

టాలీవుడ్ లో ఎంత ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ హోదాకి ఎదిగిందో.. అంతే ఫాస్ట్ గా ఇప్పుడు డౌన్ ఫాల్ చూస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె నటిస్తోన్న సినిమాలు ఫ్లాప్ లు అవుతుండడంతో తెలుగులో ఆమెకి అవకాశాలు బాగా తగ్గాయి.

ఇటీవల 'దేవ్' అనే డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమెకి 'వెంకీ మామ' సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు వెల్లడించింది.

కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి ఆమెని తప్పించినట్లు తెలుస్తోంది. 'దేవ్' సినిమా ఫ్లాప్ అవ్వడంతో రకుల్ ని తమ ప్రాజెక్ట్ లో తీసుకోవడానికి మేకర్లు వెనుకడుగు వేశారు. ఇప్పుడు ఆమె స్థానంలో రాశిఖన్నా వచ్చినట్లు సమాచారం.

వెంకీ, నాగచైతన్య హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో రాశి.. చైతుకి జంటగా కనిపించనుంది. వెంకీ సరసన పాయల్ లాంటి హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నారు. సినిమాలో  హీరోయిన్లకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

NTR: బాలకృష్ణనే నా వారసుడు.. 39 ఏళ్ల క్రితమే ప్రకటించిన ఎన్టీఆర్, ఎక్కడ మోసం జరిగింది?
Illu Illalu Pillalu Today Episode Jan 21: లేచిపోయి పెళ్లి చేసుకునేందుకు అమూల్య విశ్వక్ ప్లాన్