అతిలోక సుందరి చివరి కోరిక ఏంటో తెలుసా? ఆమె కోరికను తీర్చారా?

Published : Sep 04, 2025, 03:05 PM IST
sri devi

సారాంశం

Sridevi : బాలనటిగా సినిమా రంగంలో అడుగుపెట్టిన శ్రీదేవి తన అందం, అభినయం, నటనతో భారతీయ సినిమా లోకాన్ని శాసించింది. “అతిలోక సుందరి”గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇంతకీ అతిలోక సుందరి చివరి కోరిక ఏంటో తెలుసా? ఆమె కోరికను తీర్చారా ?

Sridevi: లెజెండరీ యాక్సరేస్ శ్రీదేవి.. భారతీయ సినీ వేదికపై ఆమె ఓ ధ్రువతార. తొలుత బాలనటిగా సినిమా రంగంలో అడుగుపెట్టిన శ్రీదేవి, అనంతరం తన అందం, అభినయం, నటనతో భారతీయ సినిమా లోకాన్ని శాసించింది. 300కు పైగా సినిమాల్లో నటించి, “అతిలోక సుందరి”గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళ, మళయాళం, హిందీ వంటి భాషల్లో నటించి, కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకుంది.

తన నటనతో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన శ్రీదేవి గత 8 సంవత్సరాల క్రితం 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. త‌న‌ మేనల్లుడి వివాహ కార్యక్రమానికి హాజరవడానికి దుబాయ్ వెళ్లిన సమయంలో, అక్కడి ఓ హోటల్ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. ఆమె వార్త మరణవార్తతో యావత్తు సినీ పరిశ్రమ షాక్‌ కు గురైంది. ఆమె మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు అనే చెప్పాలి. అయితే.. అంత విషాదకర సమయాల్లో కూడా ఆమె కుటుంబం శ్రీదేవి చివరి కోరికను నెరవేర్చిందట. ఇంతకీ ఆ చివరి కోరిక ఏంటీ?

శ్రీదేవి అసలు పేరు అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1963 ఆగస్టు 13న శివకాశి లో పుట్టింది. కేవలం ఆరేళ్ల వయస్సులోనే ‘తుణైవాన్‌’సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 1970లో ‘మానాన్న నిర్దోషి’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 1971లో మలయాళ చిత్రం ‘పూంపట్టా’లో నటించి ఉత్తమ బాలనటిగా కేరళ ప్రభుత్వం నుండి సన్మానం పొందారు. ఆ తరువాత తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ సినిమాల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అభిమానుల గుండెల్లో “అతిలోక సుందరి”గా గుర్తింపు సంపాదించుకుంది.

శ్రీదేవి తన కెరీర్ లో 300 పైచిలుకు సినిమాల్లో నటించారు. అందులో తెలుగులో 85, తమిళంలో 72, హిందీలో 71, మలయాళంలో 26, కన్నడలో 6 సినిమాల్లో నటించారు. చివరిగా 15 ఏళ్ల విరామం తర్వాత ‘ఇంగ్లీష్ వింగ్లీష్’తో ప్రేక్షకులకు తెరపై కనిపించారు. 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సిఎన్‌ఎన్-ఐబిఎన్‌ వంటి అంతర్జాతీయ గుర్తింపు కూడా పొందారు. 14 సార్లు ఫిలింఫేర్ అవార్డుకు అర్హత సాధించి 6 సార్లు ఫిలింఫేర్ అవార్డు గెలవడం ఆమె ప్రతిభకు గుర్తింపు. తన కుమార్తె జాహ్నవి కపూర్‌ను నటిగా చూడాలని ఆమె ఎంతోగానో కోరుకుంది.

చివరి కోరిక

శ్రీదేవి తెలుపు రంగును ఎంతో అభిమానించింది. ఆమె నటించిన అనేక సినిమాల్లో, పాటలలోనూ తెలుపు రంగు దుస్తులు కనిపించడం చూస్తే, ఆమెకు ఆ రంగు మీద ఉన్న ప్రేమ స్పష్టమవుతుంది. శ్రీదేవి తన ఆఖరి కోరికగా “తన అంత్యక్రియలు తెలుపు రంగుతో జరగాలి” అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులు ఈ కోరికను తీరుస్తూ, అంత్యక్రియలన్నీ తెలుపు రంగు పూలతో నిర్వహించారు. ఆమె మృతదేహాన్ని ఉంచిన స్థలాన్ని తెల్ల మల్లెలు, తెల్ల గులాబీలతో అలంక‌రించారు. 

అంతిమయాత్రకు తీసుకెళ్లిన వాహనాన్ని కూడా తెలుపు పువ్వులతో అలంకరించారు. ఈ విధంగా ఎంతో దుఃఖంలోనూ శ్రీదేవి ఆఖరి కోరికను నెరవేర్చిన ఆమె కుటుంబం, ఆమెకి తగిన గౌరవాన్ని అందించింది. ఈ విధంగా ఎంతో దుఃఖంలోనూ శ్రీదేవి ఆఖరి కోరికను నెరవేర్చారు ఆమె కుటుంబం. ఆమె మన మధ్య లేకపోయినా, సినిమాలు, నటన, అందం, అభిమానుల మనసుల్లో భారతీయ సినీ ప్రపంచంలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?