ఆంటీ అంటే అంత కోపం ఎందుకు? అనసూయ షాకింగ్ ఆన్సర్!

Published : Apr 03, 2023, 07:37 AM ISTUpdated : Apr 03, 2023, 07:46 AM IST
ఆంటీ అంటే అంత కోపం ఎందుకు? అనసూయ షాకింగ్ ఆన్సర్!

సారాంశం

యాంకర్ అనసూయకు ఆంటీ అని పిలిస్తే నచ్చదు. దానికి కారణం ఏమిటో తాజాగా ఆమె వెల్లడించారు. అనసూయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 


సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ని దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఆ మధ్య ఈ పదానికి వ్యతిరేకంగా అనసూయ పెద్ద యుద్ధమే చేసింది. లైగర్ మూవీ మీద అనసూయ చేసిన పరోక్ష కామెంట్ వివాదాస్పదమైంది. అమ్మను తిట్టిన పాపం ఇలా వెంటాడింది. అందుకే లైగర్ ప్లాప్ అనే అర్థంలో అనసూయ ట్వీట్ చేశారు. అనసూయ చర్యతో ఆగ్రహానికి గురైన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై ట్రోలింగ్ షురూ చేశారు. ఆంటీ అనే ట్యాగ్ ట్రెండ్ చేశారు. 

ఆంటీ అని పిలవడం కూడా వేధింపుల క్రిందికి వస్తుంది. నేను కేసు పడతా అంటూ అనసూయ హెచ్చరించారు. అయినా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తగ్గలేదు. దాదాపు మూడు రోజులు అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అనసూయ కొందరి మీద సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేశారు. అంతకు ముందు కూడా అనసూయను ఆంటీ అంటూ కవ్వించేవారు. ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లున్నారని, అందుకే ఆమె ఆంటీ అంటూ ఎద్దేవా చేసేవారు. 

ఈ క్రమంలో అనసూయ మొదటిసారి దీనిపై స్పందించారు. ఆంటీ అంటే తనకు కోపం ఎందుకో వివరణ ఇచ్చారు. ఆన్లైన్ ఛాట్ లో ఒక అభిమాని 'అక్కా ఆంటీ అని పిలిస్తే మీకు అంత కోపం ఎందుకు?' అని అడిగాడు. దానికి 'అవును అలా పిలిస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వారి పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుంది. అయితే ఈ మధ్య నాకు కోపం రావడం లేదు. ఈ ట్రోలర్స్ ని చక్కదిద్దడం కంటే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి' అంటూ అనసూయ సమాధానం చెప్పింది. 

అనసూయ కామెంట్ వైరల్ అవుతుంది. అనసూయ మిగతా సెలెబ్రెటీలకు భిన్నం. ఆమె ట్రోలర్స్ ని అసలు సహించరు. హద్దు దాటి కామెంట్స్ చేస్తే ఫైర్ అవుతారు. చట్టపరమైన చర్యలకు వెనుకాడరు. ఆమె కంప్లైంట్స్ తో జైలుపాలైన వాళ్ళు చాలానే ఉన్నారు. 

ఇక యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసిన అనసూయ పూర్తి సమయం సినిమాలకు కేటాయిస్తుంది. ఆమె లేటెస్ట్ మూవీ రంగమార్తాండ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనసూయ పాత్రకు పేరొచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో అనసూయ పాల్గొంటున్నారు. ఏప్రిల్ నుండి కొత్త ప్రాజెక్ట్ మొదలుకాబోతుందట. దీని వివరాలు త్వరలో వెల్లడిస్తానని అనసూయ చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?