లాక్‌ డౌన్‌లో దీపిక ఏం చేస్తుందో తెలుసా..!

Published : Jun 08, 2020, 05:35 PM IST
లాక్‌ డౌన్‌లో దీపిక ఏం చేస్తుందో తెలుసా..!

సారాంశం

లాక్‌ డౌన్‌ ప్రకటించిన వెంటనే తాను చూడాల్సిన సినిమాల లిస్ట్ రెడీ చేసి పెట్టుకుంది దీపిక పదుకొనే. ఈ సందర్భంగా ఆమె ఎన్నో అంతర్జాతీయ చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను కూడా చూసింది. కేవలం చూడటం మాత్రమే కాదు తనకు నచ్చిన సినిమాలను అభిమానులకు సజెస్ట్‌ చేస్తూ లాక్‌ డౌన్‌ సమయంలో టైం పాస్ చేసింది.

లాక్‌ డౌన్‌ కారణంగా సినీ తారలంతా ఇంటికే పరిమితమయ్యారు.  అయితే ఈ సమయాన్ని దీపిక మాత్రం క్రియేటివ్‌గా వాడుకుంటుంది. లాక్‌ డౌన్‌ ప్రకటించిన వెంటనే తాను చూడాల్సిన సినిమాల లిస్ట్ రెడీ చేసి పెట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో అంతర్జాతీయ చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను కూడా చూసింది దీపిక. కేవలం చూడటం మాత్రమే కాదు తనకు నచ్చిన సినిమాలను అభిమానులకు సజెస్ట్‌ చేస్తూ లాక్‌ డౌన్‌ సమయంలో టైం పాస్ చేసింది.

తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో డీపీ రికమండ్స్ అనే ట్యాగ్‌తో చాలా సినిమాలను అభిమానులకు సజెస్ట్ చేసింది. వాటిలో జోజో రాబిట్‌, ఫాంటమ్‌ థ్రెడ్‌, హర్‌, ఇన్‌సైడ్‌ అవుట్‌, స్లీప్‌ లెస్‌ నైట్స్‌ ఇన్‌ సీటెల్‌ లాంటి సినిమాలు, పాతాల్‌ లోక్‌ లాంటి వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి. తన రోజులో కొంత భాగాన్ని కేవలం ఇలా సినిమాలు చూసేందుకు కేటాయించింది దీపిక. అలా చూడటం ద్వారా అభిమానులకు మంచి సినిమాలు సజెస్ట్ చేయటంతో పాటు నటన పరంగా తనని తాను మెరుగుపరుచుకుంటుంది ఈ బ్యూటీ.

వెండితెర మీద దీపిక చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్‌ బస్టర్ చిత్రాలతో పాటు, చాలెంజింగ్ రోల్స్‌లో నటించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ సినిమాలు చూడటంతో పాటు ఆన్‌లైన్‌లో స్క్రిప్ట్‌లు కూడా వింటోంది. లాక్‌ డౌన్‌ లేకపోయి ఉంటే ఈ పాటికి షకున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి శ్రీలంకలో షూటింగ్‌లో పాల్గొంటూ ఉండేది దీపిక.

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద