రెండో పెళ్లిపై మీనా నిర్ణయం ఇదే.. రూమర్లపై స్పందించిన సీనియర్ నటి!

By team teluguFirst Published Dec 1, 2022, 1:32 PM IST
Highlights

సీనియర్ నటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. మరోపెళ్లి చేసుకునేందుకు మీనా నిజంగానే సిద్ధంగా ఉందా? అనే విషయం తాజాగా అప్డేట్ అందింది. రూమర్లసై నటి ఘాటుగా స్పందించినట్టు సమాచారం.
 

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ మీనా (Meena).90sలోనే తెలుగు వారికి దగ్గరైన సీనియర్ హీరోయిన్ ఇప్పటికీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉంది. ఎలాంటి  ఇబ్బందుల్లేకుండా సినీ కేరీర్ సాగిపోతున్న తరుణంలోనే మీనా పెళ్లి చేసుకుంది. 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. వీరికి పదేండ్ల కూతురు కూడా ఉంది.

భర్త చనిపోయినప్పటి నుంచి మీనా, కూతురితో కలిసి ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలో కూతురు భవిష్యత్ కోసం మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తమ కుటుంబానికి దగ్గరగా  ఉన్న వ్యక్తితోనే ఈ వివాహం జరుగుతుందని, మీనా తల్లిదండ్రులు కూడా రెండో పెళ్లికి ప్రోత్సహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు మీనా కూడా ఓకే చెప్పిందని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ వార్త నెట్టింట స్ప్రెడ్ అవుతూ మీనా వరకు చేరింది. దీనిపై మీనా స్పందించినట్టు తెలుస్తోంది. 

పెళ్లిపై వస్తున్న రూమర్లను మీనా ఖండించినట్టు ఆమె క్లోజ్ ఫ్రెండ్ ఒకు తెలిపారు. ‘భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడం సరికాదు. ఇంకా ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటామని’ సన్నిహిత వర్గాల తెలుపుతున్నాయి. ‘నిజంగా రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందని’ తెలిపారు. రూమర్లు మాత్రం క్రియేట్ చేయొద్దని సూచించారు. ఇక మీనా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. సీనియర్ హీరోల సరసన నటిస్తూ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటోంది. 
 

 

click me!