Bigg Boss Telugu 6: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్... ఆసక్తిరేపుతున్న ఎలిమినేషన్స్!

Published : Dec 01, 2022, 12:12 PM ISTUpdated : Dec 01, 2022, 12:27 PM IST
Bigg Boss Telugu 6: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్... ఆసక్తిరేపుతున్న ఎలిమినేషన్స్!

సారాంశం

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఫైనల్ కి ఐదుగురు సభ్యులు మాత్రమే ఫైనల్ కి వెళతారు. కాగా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం అందుతుంది.

బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరింది. టైటిల్ కోసం 8మంది కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. ముగ్గురు ఎలిమినేట్ కానుండగా... ఐదుగురు సభ్యులు ఫైనల్ కి వెళ్లనున్నారు. కాగా టికెట్ టు ఫినాలే గెలుచుకున్న ఆది రెడ్డి నేరుగా ఫైనల్ కి చేరినట్లు సమాచారం. నేటి ఎపిసోడ్ తో స్పష్టత రానుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఆదిరెడ్డి, రేవంత్,కీర్తి, రోహిత్, ఫైమా, శ్రీసత్య నామినేట్ అయ్యారు.

 

ప్రస్తుత ఓటింగ్ ప్రకారం ఆదిరెడ్డి, ఫైమా వెనుకబడ్డారట. సింగర్ రేవంత్ టాప్ పొజిషన్ లో కొనసాగుతుండగా... నెక్స్ట్ రోహిత్ ఉన్నాడట. ఇక మూడో స్థానంలో కీర్తి ఉన్నారట. నాలుగో స్థానంలో ఉన్న ఆదిరెడ్డి వెనక్కి నెట్టి ఆ స్థానం శ్రీసత్య కైవసం చేసుకున్నారు. దీంతో ఐదవ స్థానంలో ఆదిరెడ్డి, చివరి స్థానంలో ఫైమా ఉన్నారట. ఓటింగ్ కి రెండు రోజులే మిగిలి ఉండగా... ఆదిరెడ్డి, ఫైమాలలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు.

 

డబుల్ ఎలిమినేషన్ వీక్ అని కూడా అంటున్నారు. అదే జరిగితే ఫైమా, ఆదిరెడ్డి హౌస్ వీడవచ్చు. అప్పుడు ఆదిరెడ్డి భారీగా నష్టపోతాడు. టికెట్ టు ఫైనాలే గెలిచి కూడా ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ కోల్పోతాడు. కామనర్ గా హౌస్లోకి వెళ్లి ఫైనల్ కి చేరిన ఫస్ట్ కంటెస్టెంట్ గా రికార్డు నెలకొల్పాలని చూస్తున్న అతని కల చెదురతుంది.

 

ఈసారి కనీసం ఒకరు లేదా ఇద్దరు అమ్మాయిలు ఫైనల్ కి చేరే అవకాశం ఉంది. ఇనయా కచ్చితంగా ఫైనల్ లో ఉంటుంది. కీర్తి లేదా శ్రీసత్య ఫైనల్ కి చేరవచ్చు. లేడీ టైటిల్ అందుకునే అవకాశం ఉంటే అది ఇనయానే అంటున్నారు. గత ఐదు సీజన్లో ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా టైటిల్ గెలవలేదు. గీతా మాధురి, శ్రీముఖి మాత్రమే రన్నర్స్ గా నిలిచారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Couple Friendly Box Office: `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు.. రెండో రోజు పెరిగిన వసూళ్లు
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్, ఈ వారం థియేటర్లలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్