ప్రభాస్-అల్లు అర్జున్ లను అలా బ్యాలెన్స్ చేయనున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్!

Published : Mar 03, 2023, 01:22 PM IST
ప్రభాస్-అల్లు అర్జున్ లను అలా బ్యాలెన్స్ చేయనున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్!

సారాంశం

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ తో  కొత్త మూవీ ప్రకటన చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ మూవీ స్పిరిట్ పై సందేహాలు మొదలయ్యాయి.   


సందీప్ రెడ్డి వంగా సినిమా సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ పోతున్నారు. అర్జున్ రెడ్డి మూవీతో ఆయన న్యూ ఏజ్ లవ్ డ్రామా తెరకెక్కించారు. హీరో క్యారెక్టరైజేషన్ ఆయన తీర్చిదిద్దిన విధానానికి యూత్ కనెక్ట్ అయ్యారు. మూవీ కాసుల వర్షం కురిపించింది. విజయ్ దేవరకొండ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి సందీప్ రెడ్డి వంగా మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. కబీర్ సింగ్ షాహిద్ కపూర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

 కబీర్ సింగ్ మూవీతో ఆయన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ దృష్టిలో పడ్డారు. రన్బీర్ కపూర్ ఛాన్స్ ఇచ్చారు. ఆయనతో యానిమల్ మూవీ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీతో తానేమిటో నిరూపించుకోవాల్సి ఉంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్  సక్సెస్ గాలివాటం కాదని నిరూపించుకోవాలంటే యానిమల్ మూవీతో బంపర్ హిట్ కొట్టాలి. కాగా యానిమల్ మూవీతో వైలెన్స్ లో నెక్స్ట్ లెవెల్ చూపిస్తా అంటున్నాడు. చిత్ర విజయం మీద మంచి విశ్వాసంతో ఉన్నాడు. 

ఇక యానిమల్ విడుదల కాకుండానే భారీ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో పడుతున్నాయి. ప్రభాస్ తో స్పిరిట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా... నేడు అల్లు అర్జున్ తో కొత్త మూవీ ప్రకటించారు. యానిమల్ చిత్ర నిర్మాతగా ఉన్న భూషణ్ కుమార్ సందీప్ రెడ్డి వంగాతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ స్పిరిట్ సంగతేంటి?. స్పిరిట్ ప్రాజెక్ట్ రద్దయ్యిందా? అందుకే సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ మూవీకి కమిట్ అయ్యారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

అయితే సందీప్ రెడ్డి వంగా రెండు చిత్రాలు చేయనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ పుష్ప 2 అనంతరం త్రివిక్రమ్ తో మూవీ చేస్తారట. దీనిపై త్వరలో ప్రకటన రానుందట. త్రివిక్రమ్ ఈ ఏడాది మహేష్ మూవీ పూర్తి చేసి విడుదల చేస్తారు. దాదాపు ఒకే టైం కి అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఫ్రీ అవుతారు. 2024 ప్రారంభంలో త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. ఇక యానిమల్ పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ స్పిరిట్ కంప్లీట్ చేస్తారట. 

కాబట్టి సందీప్ రెడ్డి వంగా-అల్లు అర్జున్ ల ప్రాజెక్ట్ 2025 లో పట్టాలెక్కనుంది టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఆ విధంగా సందీప్ రెడ్డి వంగా ప్రభాస్-అల్లు అర్జున్ చిత్రాలను బ్యాలన్స్ చేయనున్నారట. సందీప్ రెడ్డి నుండి వరుసగా యానిమల్, స్పిరిట్, అల్లు అర్జున్ చిత్రాలు రానున్నాయి. లక్ అంటే సందీప్ రెడ్డిదే. ఈ గోల్డెన్ ఛాన్సులు ఆయన ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్