ఈవారం రిలీజ్ లు: ‘గ‌ల్లీ రౌడీ’,‘మాస్ట్రో’...ఇంకా

By Surya PrakashFirst Published Sep 16, 2021, 1:36 PM IST
Highlights

 ఈ క్రమంలో చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవ్వ‌బోతున్నాయి. ముఖ్యంగా ఈ శుక్ర‌వారం అయితే, అటు ఓటీటీలోనూ, ఇటు పెద్ద తెర‌పైనా కొత్త సినిమాల హంగామా జరుగుతోంది.

క‌రోనా భ‌యాలు మెల్లిగా త‌గ్గ‌డంతో ప్రేక్ష‌కులు మ‌ళ్లీ థియోటర్ల ముందు క్యూ క‌డుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా గోపీచంద్  `సిటీమార్‌` సినిమాకి థియోటర్స్ చాలా చోట్ల హౌస్ ఫుల్ అవటం కూడా  మిగిలిన ప్రొడ్యూసర్స్ లలో ఉత్సాహం నింపుతోంది. ఈ క్రమంలో చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవ్వ‌బోతున్నాయి. ముఖ్యంగా ఈ శుక్ర‌వారం అయితే, అటు ఓటీటీలోనూ, ఇటు పెద్ద తెర‌పైనా కొత్త సినిమాల హంగామా జరుగుతోంది.

వాటిల్లో  నితిన్ హీరోగా న‌టించిన `మాస్ట్రో` ఈ వార‌మే విడుద‌ల అవుతోంది. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమా హ‌క్కుల్ని ద‌క్కించుకుని స్ట్రీమింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త వారం ఓటీటీలో నాని `ట‌క్ జ‌గ‌దీష్‌`కు మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే ఈసారి నితిన్ `మాస్ట్రో` వంతు వ‌చ్చింది అంటున్నారు. బాలీవుడ్ `అంధాధూన్` చిత్రానికి ఇది రీమేక్‌. నితిన్ సినిమా కావటం, త‌మ‌న్నా, న‌భాన‌టేషాల గ్లామ‌ర్ ఈ సినిమాకి మ‌రింత ప్ల‌స్ కానుంది. 

అలాగే  రేపటి రోజున థియేట‌ర్ల‌లో `గ‌ల్లీ రౌడీ` దిగబోతున్నాడు. సందీప్ కిష‌న్ – జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబోలో రూపొందిన సినిమా ఇది.   ‘‘థియేటర్లలోనే సినిమా చూడాలనుకునే వాళ్లందరికీ పండగ లాంటి చిత్రం మా ‘గల్లీరౌడీ’. ఇంటిల్లిపాది కలిసి చూసే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది. కచ్చితంగా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్‌. సందీప్‌ కిషన్‌, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రమిది.  ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్‌ సమర్పిస్తున్నారు. రాజేంద్ర   ప్రసాద్‌, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. మంచి క‌థ ఎంచుకుంటే క‌చ్చితంగా హిట్ కొట్ట‌గ‌ల ద‌మ్ముంది.ట్రైలర్, టీజర్ బాగుండ‌డంతో – ఈ సినిమాపై అంద‌రి దృష్టీ ప‌డింది. 

ఇదే రోజున విజ‌య్ ఆంటోనీ `విజ‌య్ రాఘ‌వ‌న్‌`,  ‘‘బిచ్చగాడు’ ఓ అమ్మ కథ అయితే, ‘విజయ రాఘవన్‌’ ఓ అమ్మ కలను నెరవేర్చే చిత్రం. ఈ సినిమాలో చాలా భావోద్వేగాలున్నాయి. ప్రేక్షకులను మా చిత్రం నిరుత్సాహపరచదు’’ అని విజయ్‌ ఆంటోని అన్నారు. ఆనంద కృషన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, ఆత్మిక జంటగా రపొందిన తమిళ చిత్రం ‘కోడియిల్‌ ఒరువన్‌’. టీడీ రాజా, డీఆర్‌ సంజయ్‌ కువర్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి ‘విజయ రాఘవన్‌’ పేరుతో ఈ నెల 17న తెలుగులో విడుదల చేస్తున్నారు. . ‘‘ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలనుకునే ఓ యువకుడి కథే ‘విజయ రాఘవన్‌’’ అన్నారు ఆనంద కృషన్‌.  ఈ సినిమాతో పాటు హ‌ర్బ‌జ‌న్ సింగ్ తెరంగేట్రం చేసిన `ఫ్రెండ్ షిప్‌`, జెమ్‌, ప్లాన్ బి, హ‌నీ ట్రాప్ సినిమాలు థియేట‌ర్ల‌లోనే రాబోతున్నాయి.

click me!