థర్టీ ఇయర్స్ పృథ్వీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

Siva Kodati |  
Published : Oct 20, 2020, 07:50 PM IST
థర్టీ ఇయర్స్ పృథ్వీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

సారాంశం

ప్రముఖ సినీనటుడు, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఈ ఘటన జరిగిందంటూ పృథ్వీరాజ్‌ టీం ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించింది.

ప్రముఖ సినీనటుడు, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఈ ఘటన జరిగిందంటూ పృథ్వీరాజ్‌ టీం ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించింది.

బంజారాహిల్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్‌ వెళ్తుండగా ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైంది. అయితే పృథ్వీరాజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా కొద్దిరోజుల క్రితం పృథ్వీరాజ్‌ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?