బాలీవుడ్ నటి ఇంట్లో దొంగతనం, చేసింది ఎవరో కాదు

By Surya Prakash  |  First Published Jan 9, 2025, 8:09 AM IST

బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లాన్ ఇంట్లో లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, నగదు చోరీకి గురయ్యాయి. పెయింటింగ్ పనికి వచ్చిన వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.



బాలీవుడ్‌ ప్రముఖ నటి పూనమ్‌ ధిల్లాన్‌ (Poonam Dhillon) ఇంట్లో చోరీ జరిగింది. రూ.లక్ష విలువైన డైమండ్‌ నెక్లెస్‌ (Diamond Necklace) సహా నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు 37 ఏళ్ల సమీర్‌ అన్సారీగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

 నటి పూనమ్ ధిల్లాన్ (Poonam Dhillon) ఇంట్లో సోమవారం లక్ష విలువైన డైమండ్ నెక్లెస్ చోరీకి గురైంది. ఇంట్లో పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.35 వేల నగదు, కొన్ని డాలర్లు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు   37 ఏళ్ల సమీర్‌ అన్సారీని నిందితుడిగా గుర్తించారు.  సమీర్ అన్సారీ  నటి పూనమ్  ఇంటికి పెయింటింగ్ వేయాడానికి వచ్చాడు.   డిసెంబర్‌ 28 నుంచి జనవరి 5 మధ్య పెయింటింగ్‌ చేశారు.

Latest Videos

ఆ సమయంలోనే విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. ఫ్లాట్‌కు రంగులు వేసేకి వచ్చిన టీమ్ లో సమీర్‌ అన్సారీ కూడా ఉన్నాడు. ఒకరోజు ఇంటి అల్మారాను తెరిచి ఉండడం గమనించిన అన్సారీ.. అదే అవకాశంగా చోరీకి పాల్పడ్డాడు.  అన్సారీ తాళం వేసివున్న అల్మారాలో ఉన్న   డైమండ్ నెక్లెస్ తో పాటుగా రూ.35 వేల డబ్బు, కొన్ని విలువైన వస్తువులను  ఎత్తుకెళ్లాడు.  

 దొంగతనం గురించి నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చోరీకి పాల్పడింది సమీర్‌ అన్సారీగా గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దోచుకున్న డబ్బులో కొంత భాగాన్ని స్నేహితులకు ఇచ్చిన పార్టీ కోసం ఖర్చు చేశానని అన్సారీ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.  

1977లో, పూనమ్ ధిల్లాన్ మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది.  2001లో విడుదలైన ఇష్టం సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నటిగానే కాకుండా ఆమె సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగానూ ఎదిగింది. మాదకద్రవ్యాలు, ఎయిడ్స్, కుటుంబ నియంత్రణ, అవయవ దానం వంటి సామాజిక అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో ఆమె చాలా చురుకుగా ఉంటుంది.   

click me!