‘నా ప్రేమ వివాహానికి కారణం ఎన్టీఆరే ’.. అశ్వినీ దత్ కూతురు షాకింగ్ కామెంట్స్.. అసలేమైందీ?

Published : Aug 24, 2022, 01:03 PM IST
‘నా ప్రేమ వివాహానికి కారణం ఎన్టీఆరే ’.. అశ్వినీ దత్ కూతురు షాకింగ్ కామెంట్స్.. అసలేమైందీ?

సారాంశం

ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కూతురు  తాజాగా తన వివాహం గురించి చెబుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో తారక్ ఎలా స్పందించాడో వివరించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కొనియాడని వారుండరు. జూనియన్ ఎన్టీఆర్ వారసత్వాన్ని ఎన్టీఆర్ అందిపుచ్చుకొని తనదైన శైలిలో చిత్ర సీమలో దూసుకెళ్తున్నారు. మరోవైపు ప్రేక్షకులు, అభిమానుల ప్రేమను  అంతకంతకు సొంతం చేసుకుంటున్నాడు. అయితే ఎన్టీఆర్ వ్యక్తిత్వం పై ప్రముఖ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (Ashwini Dutt) కూతురు స్వప్న దత్ (Swapna Dutt) తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన ప్రేమ వివాహానికి తారక్ ఎలా సహకరించాడో చెబుతూ ఎన్టీఆర్ గొప్ప మనస్సును వెల్లడించింది. 

రీసెంట్ గా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వప్న దత్ మాట్లాడుతూ తన ప్రేమ వివాహానికి ఎన్టీఆరే కారణమని చెప్పింది. ‘నా మ్యారేజ్ జరగడానికి తారక్ ఒక కారణం. పెండ్లికి ముందే నా భర్త ప్రసాద్ వర్మ నేను కొంతకాలంగా ప్రేమించుకున్నాం. ఈ విషయాన్ని మా నాన్న కు చెప్పడానికి మాత్రం ధైర్యంగా చాలలేదు. దీంతో విషయాన్ని తారక్ తో చెప్పాను. తను వెంటనే ఇంట్లో చెప్పమని అన్నాడు. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదని సూచించాడు. ఆ తర్వాత నాన్నతోనే నేరుగా మాట్లాడి ఒప్పించాడు’ అని చెప్పుకొచ్చింది. 

అయితే ఆ సమయానికి తారక్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ‘శక్తి’మూవీలో నటిస్తున్నారు. అదే సమయంలో 2010లోనే తారక్ చేసిన సాయంతో తన పెళ్లి గ్రాండ్ గా జరిగిందని చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం స్వప్న చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన గొప్ప మనస్సును మరోసారి చెప్పడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న తారక్.. ఆయన అద్భుతమైన పెర్ఫామెన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో తారక్ పేరు ‘ఆస్కార్ 2022’ లిస్ట్ లో చేరింది. 

వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరిన్నీ భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ కు అనుబంధంగా వచ్చిన ‘స్వప్న సినిమాస్’ బ్యానర్ బాధ్యతలను స్వప్న దత్ చూసుకుంటున్నారు. ఈ బ్యానర్ లో ఇటీవల ‘సీతా రామం’ చిత్రం రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. అలాగే సోదరి ప్రియాంక దత్ తో కలిసి అటు వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రాల బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్ లో రెబల్ స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ‘ప్రాజెక్ట్ కే’ రూపుదిద్దుకుంటోంది.  దాదాపు రూ.500 కోట్లతో పాన్ వరల్డ్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు