#ButtaBomma:పోస్టర్ కాపీ అరాచకం, యాజటీజ్ దింపేసారే

By Surya PrakashFirst Published Dec 18, 2022, 8:38 AM IST
Highlights

ప్రస్తుతం ఈ సంస్థ ‘బుట్ట బొమ్మ’ అనే చిన్న సినిమాను నిర్మిస్తుంది. శౌరీ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న మలయాళంలో సూపర్‌ హిట్టయిన కప్పెల సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. 


సోషల్ మీడియా రోజుల్లో ఏదీ గుట్టుగా చేయలేకపోతున్నారు. ఎక్కడ ఏ చిన్న కాపీ దొరికినా ఇట్టే పట్టుకుని జనం ముందు పెట్టేస్తున్నారు. కష్టపడి కాపి కొట్టిన కష్టం కొద్ది క్షణాల్లో తేలిపోతోంది. గతంలో చాలా సినిమాల పోస్టర్స్ ...ఫలానా సినిమా పోస్టర్ కాపీ అని వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బుట్టబొమ్మ చిత్రానికి సంభందించిన పోస్టర్ కాపీ అని తేల్చేసారు. మీరు ఇక్కడ ఆ రెండు పోస్టర్స్ ని చూడవచ్చు. ఏ మాత్రం మార్పులు చేయకుండా  2006 నోలన్ దర్శకత్వంలో వచ్చిన 'The Prestige' పోస్టర్ ని #ButtaBomma గా దింపేయటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియా జనం ఊరుకుంటారా...నిర్మాత నాగవంశీని  దారుణంగా కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

సినిమా విషయానికి వస్తే...టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్‌టైనమెంట్స్‌ ఒకటి.   ప్రస్తుతం ఈ సంస్థ ‘బుట్ట బొమ్మ’ అనే చిన్న సినిమాను నిర్మిస్తుంది. శౌరీ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న మలయాళంలో సూపర్‌ హిట్టయిన కప్పెల సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. అర్జున్‌ దాస్‌, అంకితా సురేంద్రన్‌, సూర్య వశిష్ట ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. 

బుట్టబొమ్మ సినిమాను జనవరి 26న విడుదల చేయబోతున్నారు. ఓ చిన్న సినిమాకు హాలిడే వీకెండ్ దొరకడం పెద్ద విషయం.  గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయంటున్నారు మేకర్స్. 'ప్రేమ' లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయట. వీటితో పాటు వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. 'వరుడు కావలెను' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నాడు. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనమెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి.
 

click me!