Trivikram: మెగా ఫ్యామిలీ తో స్నేహం... త్రివిక్రమ్ కి డబ్బులే డబ్బులు 

Published : Jul 26, 2022, 05:28 PM ISTUpdated : Jul 26, 2022, 05:29 PM IST
Trivikram: మెగా ఫ్యామిలీ తో స్నేహం... త్రివిక్రమ్ కి డబ్బులే డబ్బులు 

సారాంశం

మెగా ఫ్యామిలీతో స్నేహం త్రివిక్రమ్ కి కాసులు కురిపిస్తుంది. సినిమాలు చేసినా చేయకున్నా ఆదాయం తెచ్చి పెడుతుంది. త్రివిక్రమ్ అదృష్టం చూసి కుళ్ళు కోవడం ఇతర దర్శకుల వంతవుతుంది.   

టాలీవుడ్ అంతా ఒకవైపు మెగా ఫ్యామిలీ ఒకవైపు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ఇండస్ట్రీలో 7గురు స్టార్ హీరోలు ఉన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ మినహాయిస్తే మిగతా నలుగురు చిరంజీవి, పవన్, చరణ్, బన్నీ ఒకే కుటుంబానికి చెందినవారు. అది చాలదన్నట్లు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ టూ టైర్ హీరోలుగా ఓ స్థాయి మార్కెట్ సంపాదించారు. కాబట్టి మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టిన దర్శకుడికి తిరుగుండదు. హీరోల కోసం వెతుకులాట, ఏళ్ల తరబడి వైటింగ్స్ ఉండవు. కాస్త టాలెంట్ ఉందని నిరూపించుకుంటే శిఖరాలకు ఎదిగిపోవచ్చు. 

ప్రస్తుతం మెగా హీరోలు మెచ్చిన, నచ్చిన దర్శకుడిగా త్రివిక్రమ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తో మొదలైన ఆయన జర్నీ అల్లు అర్జున్ వరకు పాకింది. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు భారీ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్...  చరణ్, చిరంజీవి హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఎప్పటి నుండో పవన్ లో సగభాగంగా త్రివిక్రమ్ మారిపోయాడు. అల వైకుంఠపురంలో హిట్ తో అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడయ్యాడు. ఈ ఇద్దరు హీరోల స్నేహం త్రివిక్రమ్ కి అదనపు ఆదాయం తెచ్చి పెడుతుంది. భీమ్లా నాయక్ రీమేక్ చేయాలని పవన్ కి త్రివిక్రమ్ సూచించారు. ప్రియ మిత్రుడు మాట కాదనకుండా ముందుగా ఒప్పుకున్న చిత్రాలు కూడా పక్కనపెట్టి భీమ్లా నాయక్ పూర్తి చేశాడు. 

భీమ్లా నాయక్ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్ ఏకంగా రూ. 20 కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం. రెమ్యునరేషన్, నిర్మాణ భాగస్వామ్యంలో రూపంలో అంత మొత్తంలో త్రివిక్రమ్ కి దక్కింది. కేవలం మూడు నాలుగు నెలల సమయానికి ఆయన భారీ అమౌంట్ సంపాదించారు. పవన్ మరలా వినోదయ సిత్తం రీమేక్ మొదలుపెట్టారు. ఆ చిత్రానికి కూడా పవన్ మాటలు అందిస్తున్నట్లు సమాచారం. 

ఇక అల్లు అర్జున్ యాడ్స్ కి త్రివిక్రమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బన్నీ రికమండేషన్ తో  ఆయన యాడ్స్ డైరెక్ట్ చేసే అవకాశాలు త్రివిక్రమ్ కి దక్కుతున్నాయి. ఓ యాడ్ షూట్ అంటే మాక్సిమమ్ రెండు మూడు రోజులు. ఈ షార్ట్ గ్యాప్ లో త్రివిక్రమ్ ఎంతో కొంత ఆర్జించవచ్చు. సాధారణంగా ఇతర దర్శకులకు సినిమా చేస్తేనే డబ్బులు, లేదంటే ఎటువంటి ఆదాయం ఉండదు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్స్ మాత్రం లౌక్యంతో ఇండస్ట్రీ పెద్దలను గుప్పెట్లో పెట్టుకొని అన్ని వేళలా విరామం లేకుండా సంపాదిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..