#LEO పై కావాలనే నెగిటివ్ క్యాంపైన్? రీజన్ అదే

By Surya Prakash  |  First Published Oct 28, 2023, 7:13 AM IST

సరిగ్గా పరిశీలిస్తే  కావాలనే కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో,మీడియాలో  నెగిటివ్ క్యాంపైన్ రన్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. విజయ్ కు వ్యతిరేకంగా కొన్ని మీడియా ఛానెల్స్ , టీవి ఛానెల్స్...


ఇళయదళపతి విజయ్ తాజాగా  భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'లియో'తో అభిమానుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్​ మోడ్​లో వచ్చిన ఈ సినిమా  దసరా సందర్బంగా వారం క్రితం అంటే అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైంది. లియో సినిమా రిలీజ్ అయ్యాక తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా మిగిలిన ప్లేస్ లలో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. విజయ్ ,లోకేష్ కనకరాజ్ అభిమానులని లియో సినిమా ఆనందపరిచినా..  రెగ్యులర్ సినీ గోయర్స్ ని  మాత్రం నిరుత్సాహపరిచింది. 

ఇక విజయ్ లియో సినిమా మొదటి రోజే 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించి. ఆ తర్వాత వారం రోజుల్లో లియో సినిమా 461 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వారం రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తమిళ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది అని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే అదే సమయంలో అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంట టాక్ స్ప్రెడ్ అవటం మొదలైంది. అయితే ఇదంతా విజయ్ కు వస్తున్న పొలిటికల్ హీరో అంటున్నారు మరికొంతమంది. కావాలనే విజయ్ సినిమాలను తగ్గించి చూపటం, నెగిటివ్ క్యాంపైన్ చేయటం జరుగుతోందని, ఇదంతా పొలిటికల్ యాంగిల్ లో చూడాలని చెప్తున్నారు. 

Latest Videos

కావాలనే కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో,మీడియాలో  నెగిటివ్ క్యాంపైన్ రన్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. విజయ్ కు వ్యతిరేకంగా కొన్ని మీడియా ఛానెల్స్ , టీవి ఛానెల్స్ కూడా వర్క్ చేస్తున్నాయని, ఆ క్రమంలోనే లియోని ఫేక్ అని,సినిమా డిజాస్టర్ అని చెప్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా లియో ఓవర్ సీస్ కలెక్షన్స్ ని ప్రాక్సీ బుక్కింగ్స్ అనే ప్రచారం సైతం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. లియో డిజాస్టర్ అని హ్యాష్ ట్యాగ్ ని ఎవరు మొదెట్టారు ,ఇదంతా నెగిటివ్ క్యాపైన్ లో భాగమే అని చెప్తున్నారు. అధికార పక్షం..విజయ్ కు వ్యతిరేకమని , ఇదంతా పొలిటికల్ ఎజెండాలో భాగమే అని, త్వరలో విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారనేది ఇది కౌంటర్ అని చెప్పుకుంటున్నారు. 
  
మరో ప్రక్క తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం లియో సినిమా కలెక్షన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తిరుపూర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. లియో సినిమా కలెక్షన్స్ అన్ని ఫేక్. నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ చెప్తున్నారు. తమిళనాడు థియేటర్స్ కి అయితే లాభాలు రాలేదు. నిర్మాత లలిత్ కుమార్ 5 కోట్లు ఖర్చుపెట్టి ఫేక్ బుకింగ్స్, ప్రమోషన్స్ చేయిస్తున్నారు. తప్పుడు కలెక్షన్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారగా పలువురు విజయ్ అభిమానులు అతనిపై విమర్శలు చేస్తున్నారు.
  
ఇక  ఈ సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో న‌టించారు. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర‌లో చ‌క్క‌టి హీరోయిజాన్ని చూపించారు. ప్రస్తుతానికి దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంది లియో.
 

click me!