
రాజకీయాల్లో బిజీగా దళపతి విజయ్
దళపతి విజయ్ ఇటీవల రాజకీయ రంగంలో చురుకుగా మారుతున్నారు. ఆయన ఇటీవల నిర్వహించిన పబ్లిక్ మీటింగులకు లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితంపై పుకార్లు మళ్లీ గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్, ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకులు తీసుకోబోతున్నారని చెప్పే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివాదంలోకి త్రిష పేరు
గతేడాది నుంచే విజయ్-సంగీత విడాకుల గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌లో హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు కూడా లాగబడింది. అయితే ఇప్పటివరకు విజయ్ గానీ, త్రిషా గానీ ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ విడాకుల పుకార్ల మధ్య సంగీత తన కుమారుడు జేసన్ సంజయ్ తో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించడం మరింత చర్చనీయాంశంగా మారింది. జేసన్ సంజయ్ త్వరలోనే సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగు పెట్టబోతున్నారని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది.
విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ
మరోవైపు కెరీర్ పరంగా విజయ్ ప్రస్తుతం జన నాయకన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా భగవంత్ కేసరి (తెలుగు)కి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరేన్, ప్రియమణి, మమితా బైజు వంటి పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విజయ్ రాజకీయ ప్రస్థానం, ఆయన కొత్త సినిమా అప్‌డేట్స్ మధ్యలో మళ్లీ వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.