హాస్యనటుడు వివేక్‌ కుటుంబాన్ని పరామర్శించిన విజయ్‌..ఎమోషనల్‌

By Aithagoni RajuFirst Published Apr 27, 2021, 8:59 AM IST
Highlights

తమిళ నటుడు, కమెడీయన్‌ వివేక్‌ కుటుంబాన్ని దళపతి విజయ్‌ పరామర్శించారు. వివేక్‌ హఠాన్మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోవడంతో వారిని విజయ్‌ ఓదార్శారు.

తమిళ నటుడు, కమెడీయన్‌ వివేక్‌ కుటుంబాన్ని దళపతి విజయ్‌ పరామర్శించారు. వివేక్‌ హఠాన్మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోవడంతో వారిని విజయ్‌ ఓదార్శారు. వివేక్‌ ఈ నెల 17న కన్నుమూశారు. ఆ సమయంలో విజయ్‌ ఇండియాలో లేరు. తన సినిమా షూటింగ్‌ నిమిత్తం జార్జియాలో ఉన్నారు. దీంతో వివేక్‌ని కడసారి చూడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇండియాకి తిరిగి వచ్చిన విజయం సోమవారం వివేక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యాన్నిచ్చారు. 

విజయ్‌, వివేక్‌ కలిసి అనేక సినిమాల్లో నటించారు. విజయ్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి చాలా సినిమాల్లో వివేక్‌ని హాస్యనటుడిగా తీసుకున్నారు. ఇటీవల వచ్చిన `విజిల్‌` చిత్రంలోనూ వివేక్‌ నటించి ఆకట్టుకున్నారు. అంతకు ముందు `కురువి`(తెలుగులో దోపిడి), `ఉదయ`, `ఆతి`(ఇది కళ్యాణ్‌ రామ్‌ నటించిన `అతనొక్కడే`కి రీమేక్‌), `తిరుమలై` వంటి పలు సినిమాల్లో కలిసి నటించారు. వివేక్‌తో తనకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో విజయ్‌ ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు.

తనదైన నటనతో, కామెడీతో నవ్వులు పూయించిన వివేక్‌ ఇటీవల `విజిల్‌` తోపాటు `దారాల ప్రభు` చిత్రంలో కనిపించారు. `అరణ్మనై 3`, `ఇండియన్‌ 2`, వంటి చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇక విజయ్‌ ఈ ఏడాది సంక్రాంతికి `మాస్టర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ప్రస్తుతం నెల్సన్‌ దిలిప్‌ కుమార్‌ దర్శకత్వంలో తన 65వ చిత్రంలో నటిస్తున్నారు.

click me!