రజినీకాంత్ Thalaivar 170లో రానా దగ్గుబాటి.. మరో ముగ్గురు బ్యూటీలకు ఛాన్స్.. అఫీషియల్ అప్డేట్

Published : Oct 03, 2023, 01:40 PM IST
రజినీకాంత్ Thalaivar 170లో రానా దగ్గుబాటి.. మరో ముగ్గురు బ్యూటీలకు ఛాన్స్.. అఫీషియల్ అప్డేట్

సారాంశం

రజినీకాంత్ 170వ చిత్రం నుంచి సూపర్ అప్డేట్ అందింది. ఇప్పటికే ఈచిత్రాన్నిఅధికారికంగా అనౌన్స్ చేయగా.. తాజాగా నటీనటులపై అఫీషియల్ అప్డేట్ అందించారు. రానాతో పాటు మరో ముగ్గురు యంగ్ హీరోయిన్లు నటించబోతున్నట్టు తెలిపారు.   

నెల్సన్ దిలీప్ కుమార్ (Dileep) దర్శకత్వంలో రజినీకాంత్ ‘జైలర్’ (Jailer) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. రూ.700 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇక రజనీ ‘జైలర్’ సక్సెస్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం తలైవా చేతిలో కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న ‘లాల్ సలామ్’ ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

అయితే Lal Salaam చిత్రాన్ని రూపొందిస్తున్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ లోనే రజినీకాంత్ మరో సినిమా చేస్తున్న విషయం గతంలోనే ప్రకటించారు. Thalaivar 170గా అనౌన్స్ మెంట్ కూడా చేశారు. ఇప్పటికే ఈ బ్యానర్ లో రజినీకాంత్ ‘రోబో 2.0’, ‘దర్బార్’ చిత్రాలు చేశారు. ‘లాల్ సలామ్’ కూడా తెరకెక్కుతోంది. రజినీకాంత్ నాలుగోసారి ఇదే బ్యానర్  సినిమా చేస్తుండటం విశేషం. లైకా సంస్థ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ సుభాకరన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ పనులు శరవేగంగా జరుగున్నాయి. ఈ సందర్భంగా అదిరిపోయే న్యూస్ అందించారు. 

Thalaivar 170  నటీనటులపై మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు. ఈ చిత్రంలో స్టార్ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati)  కూడా నటిస్తున్నారని తెలిపారు. రానా చేరికతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే చిత్రంలో ముగ్గురు యంగ్ హీరోయిన్లకు చోటు దక్కింది. రితికా సింగ్ (Ritika Singh), మంజు వారియర్ (Manju Warrier), దుషార విజయన్ (Dushara Vijayan) నటిస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేయడం పట్ల సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. 

ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ (TJ Gnanavel) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈయన చివరిగా తమిళ  స్టార్ హీరో సూర్యతో ‘జై భీమ్’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. బలమైన కథలను ఎంచుకోవడం దర్శకుడి ప్రత్యేకత. ఈ క్రమంలో రజినీని 170వ చిత్రంలో ఎలా ప్రజెంట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా  మారింది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

The RajaSaab Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాని కాపాడిన సీన్లు అవే, ప్రభాస్ కష్టం వృధానేనా ?
Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!