మోడీ విక్టరీ.. సంతోషంలో వివాదాస్పద హీరోయిన్ ఏం చేసిందంటే!

By Siva KodatiFirst Published 24, May 2019, 3:28 PM IST
Highlights

ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కేంద్రంలో మరోమారు నరేంద్రమోడీ నేతృత్వంలోనే బీజేపీకే ప్రజలు పట్టక కట్టారు. బంపర్ మెజారిటీతో ఎవరి మద్దతూ  అవసరం లేకుండానే అత్యధిక ఎంపీ సీట్లని బిజెపి గెలుచుకుంది. మోడీకి బాలీవుడ్ తారల్లో చాలా మందే అభిమానులు ఉన్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కేంద్రంలో మరోమారు నరేంద్రమోడీ నేతృత్వంలోనే బీజేపీకే ప్రజలు పట్టక కట్టారు. బంపర్ మెజారిటీతో ఎవరి మద్దతూ  అవసరం లేకుండానే అత్యధిక ఎంపీ సీట్లని బిజెపి గెలుచుకుంది. మోడీకి బాలీవుడ్ తారల్లో చాలా మందే అభిమానులు ఉన్నారు. వివాదాల క్వీన్ కంగనా రనౌత్ మోడీ విజయం సాధించడంతో గాల్లో తేలిపోతోందట ఈ విషయాన్ని కంగనా సోదరి రంగోలి వెల్లడించారు. 

కంగనా రనౌత్ ఎంతో సంతోషంతో ఉంటె కానీ వంట చేయదు. ప్రస్తుతం కంగనా ఫుల్ హ్యాపీగా ఉంది. అందుకే తానే స్వయంగా పకోడీలు, కాఫీ తయారు చేసి అందరికి వడ్డించింది. ఆమె సంతోషానికి కారణం మోడీ విజయం సాధించడమే అని రంగోలి తెలిపారు. కంగనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పకోడీలు తింటున్న దృశ్యాలని రంగోలి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

తమ జనరేషన్ మోడీ లాంటి నాయకుడిని పొందడం అదృష్టం అని కూడా రంగోలి ట్వీట్ చేశారు. ఇలా కంగనా ఫ్యామిలీ మొత్తం మోడీకి వీరాభిమానులనే విషయం తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖులతో కంగనా రనౌత్ వరుసగా వివాదాల్లో నిలుస్తుండడం చూస్తూనే ఉన్నాం. 

 

 

 

Kangana cooks rarely, when she is absolutely exhilarated, today she treated us with chai pakodas for ⁦⁩ Ji’s win 😁🥳 🙏 pic.twitter.com/6hJIuxby9W

— Rangoli Chandel (@Rangoli_A)
Last Updated 24, May 2019, 4:16 PM IST