రవితేజ హీరోయిన్ ఇంట్లో పదిమందికి కరోనా!

Published : May 20, 2021, 12:49 PM IST
రవితేజ హీరోయిన్ ఇంట్లో పదిమందికి కరోనా!

సారాంశం

హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో ఏకంగా పదిమందికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని డింపుల్ హయాతి స్వయంగా తెలియజేశారు. ఒకే కుటుంబానికి చెందిన పది మందికి కరోనా సోకడం దిగ్భ్రాంతి కలిగించే విషయమే అని చెప్పాలి.

కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి తాజా సంఘటనే నిదర్శనం. యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో ఏకంగా పదిమందికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని డింపుల్ హయాతి స్వయంగా తెలియజేశారు. ఒకే కుటుంబానికి చెందిన పది మందికి కరోనా సోకడం దిగ్భ్రాంతి కలిగించే విషయమే అని చెప్పాలి. డింపుల్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఉంటారట. దీనితో ఒకరికి సోకిన వైరస్ అందరికీ వ్యాపించింది. 


ఇక తన తాత గారు కరోనా కారణంగా చెన్నై హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారట. లాక్ డౌన్ కారణంగా హయాతి హైదరాబాద్ లో ఇరుక్కుపోయారట.  విపత్కర సమయంలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం బాధగా ఉందంటూ హయాతి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి తనను ఒత్తిడికి గురి చేస్తుందని డింపుల్ చెప్పడం బాధాకరం. 


తెలుగు అమ్మాయి అయిన హయాతి గద్దలకొండ గణేష్ మూవీలో స్పెషల్ సాంగ్ చేశారు. రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఖిలాడి చిత్రంలో ఓ హీరోయిన్ గా ఆమె నటిస్తున్నారు. అలాగే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తదుపరి చిత్రంలో కూడా హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది డింపుల్ హయాతి. 

PREV
click me!

Recommended Stories

Janhvi Kapoor: త్వరలో ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. కెరీర్ పీక్ లో ఉండగా ఇలా, తండ్రి ఏమంటున్నాడో తెలుసా
Thalapathy Vijay: బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు.. దళపతి విజయ్ మాస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా?