తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ రచయిత కందికొండ కన్నుమూత

Published : Mar 12, 2022, 04:51 PM ISTUpdated : Mar 12, 2022, 05:28 PM IST
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ రచయిత కందికొండ కన్నుమూత

సారాంశం

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత కందికొండ యాదగిరి (Kandikonda Yadagiri) కన్నుమూశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత కందికొండ యాదగిరి (Kandikonda Yadagiri) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు వెంగళరావునగర్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కందికొండ తెలంగాణ సంస్కృతిని ప్రతిబించించేలా పాటలు రాసిన సంగతి తెలిసిందే. ఇక, కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. కందికొండను సినీ రంగానికి దివంగత సంగీత దర్శకుడు చక్రి పరిచయం చేశారు. కందికొండ రాసిన మళ్లీ కూయవే గువ్వా పాట.. ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. 

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కొందికొండ కొన్ని వందల పాటలు రాశారు. ఇడియట్, సత్యం, పోకిరి.. వంటి హిట్‌ చిత్రాల్లో కందికొండ పలు పాటలు రాశారు. 2018లో చివరి సారిగా నీది నాది ఒకే కథ చిత్రంలో రెండు పాటలు రాశారు. 

అయితే గత కొంతకాలంగా కందికొండ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. త్రోట్ క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో  ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. అయితే కందికొండ చికిత్సకు భారీగా డబ్బులు ఖర్చు కావడంతో ఆయన కుటుంబం.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. గతేడాది కందికొండ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి తక్షణ సాయం అందజేశారు. 

కందికొండ చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి 2.50 లక్షల రూపాయల తక్షణ సాయం అందేలా చూశారు. ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి పూర్తిగా విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. 

PREV
click me!

Recommended Stories

Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు