షార్ట్ ఫిలిమ్స్ చేసి కష్టపడి పైకొచ్చిన తెలుగు యువ దర్శకులు!

First Published Jan 29, 2019, 6:44 PM IST

అవకాశాల కోసం పరిగెత్తడం కన్నా చిన్నగా షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని అవకాశాలను ఈజీగా అందుకోవడం ఈ రోజుల్లో అసలైన సక్సెస్ ఫార్ములా. ఆ రూట్ లో వచ్చి అవకాశాలను అందుకున్న కొంత మంది తెలుగు దర్శకులు వీరే.. 

శ్రీరామ్ ఆదిత్య: మొదట ది కాన్స్పిరేన్సీ షార్ట్ ఫిల్మ్ చేసిన శ్రీరామ్ ఆ తరువాత భలే మంచి రోజు సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. అనంతరం శమంతకమణి సినిమా చేసి నాని - నాగ్ లతో దేవదాస్ అనే మల్టి స్టారర్ ను డైరెక్ట్ చేశాడు.
undefined
నాగ్ అశ్విన్: శేఖర కమ్ముల వద్ద శిష్యరికం చేసిన ఈ డైరెక్టర్ యాదోన్ కి భారత్ అనే షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించాడు. ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం - మహానటి సినిమాలతో పాపులర్ అయ్యాడు.
undefined
ప్రశాంత్ వర్మ: ది డార్క్ పేరుతో సైలెంట్ గా డైలాగ్స్ తో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నాని నిర్మించిన అ! సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. నెక్స్ట్ రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేస్తున్నాడు.
undefined
తరుణ్ భాస్కర్: సైన్మా షార్ట్ ఫిల్మ్ తో యూ ట్యూబ్ లో పాపులరైన తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్ ని ఆకర్షించే విధంగా హిట్టందుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాను కూడా తరుణ్ డైరెక్ట్ చేశాడు.
undefined
మేర్లపాక గాంధీ: కర్మరా దేవుడా అనే షార్ట్ ఫిల్మ్ చేసిన గాంధీ మొదట వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సక్సెస్ కొట్టాడు. ఆ తరువాత ఎక్స్ ప్రెస్ రాజా - కృష్ణార్జున యుద్ధం సినిమాలు డైరెక్ట్ చేశాడు.
undefined
సుజీత్: దాదాపు 38 షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ యువ దర్శకుడు ప్రస్తుతం టాలీవుడ్ లోనే అతి చిన్న వయసు గల దర్శకుడు. రన్ రాజా రన్ వంటి సినిమాతో హిట్టందుకొని సెకండ్ సినిమానే భారీ బడ్జెట్ లో ప్రభాస్ (సాహో) తో చేస్తున్నాడు.
undefined
రాహుల్ సంకృత్యన్: చిత్ర ఐ లవ్యూ.. WHO కిల్లీడ్ మీ వంటి డిఫరెంట్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన రాహుల్ విజయదేవరకొండతో టాక్సీ వాలా సినిమాను తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్నాడు.
undefined
హను రాఘవపూడి: ఐ యామ్ ఫెమస్ అనే షార్ట్ ఫిల్మ్ చేసిన హను అందాల రాక్షసి - కృష్ణ గాడి వీర ప్రేమ గాధ - లై - పడి పడి లేచే మనసు వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు.
undefined
శివ నిర్వాణ: నిన్ను కోరి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న శివ అంతకుముందు లవ్ అల్జీబ్రా అనే షార్ట్ ఫిల్మ్ తో సినీ ప్రముఖులను ఆకర్షించాడు. ప్రస్తుతం నాగ చైతన్య - సమంత నటిస్తున్న మజిలీ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
undefined
విరించి వర్మ: నిన్నటి వెన్నల షార్ట్ ఫిల్మ్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడు ఉయ్యాలా జంపాల సినిమాను డైరెక్ట్ చేశాడు. నానితో మజ్ను సినిమాకు కూడా విరించి దర్శకత్వం వహించాడు. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయడానికి ఈ యువ దర్శకుడు సిద్దమవుతున్నాడు.
undefined
కార్తీక్ ఘట్టమనేని: 35 షార్ట్ ఫిలిమ్స్ చేసిన కార్తీక్ నిఖిల్ తో సూర్య VS సూర్య సినిమా చేశాడు.
undefined
లక్ష్మణ్ కార్య - గుడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడు ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేశాడు.
undefined
హుస్సేన్ షా కిరణ్: లవ్ ఎగైన్ - ఐ2 షార్ట్ ఫిలిమ్స్ చేసిన ఈ యువకుడు 'మీకు మీరే మాకు మేమె' అనే సినిమాను తెరకెక్కించాడు.
undefined
పవన్ సాధినేని: ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా పవన్ అంతకుముందు తనదైన శైలిలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇంటర్నెట్ లో వైరల్ అయ్యేలా చేశాడు. (include Loser, Love Formula 31 & Why Doesn't My Wife Like Me?). ఇక నారా రోహిత్ తో సావిత్రి అనే సినిమా కూడా చేశాడు.
undefined
కృష్ణ చైతన్య: పాటల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య ఇంప్రెస్స్ (షార్ట్ ఫిల్మ్) తో డైరెక్టర్ గా కొత్త దారిని ఎంచుకున్నాడు - రౌడీ ఫెలో - ఛల్ మోహన్ రంగ సినిమాలను తెరకెక్కించాడు.
undefined
దేవాకట్టా: వెన్నల సినిమాతో పరిచయమైనా దేవాకట్టా ఆ తరువాత ప్రస్థానం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ కథ విషయంలో రాజమౌళి దేవాకట్టా సహాయం తీసుకున్నాడు. ఈ దర్శకుడు డైయింగ్ టు బీ మీ అనే షార్ట్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేశాడు.
undefined
click me!