ఛార్మిపై కేసు.. విచారణకు డిమాండ్!

By Surya PrakashFirst Published Mar 5, 2020, 4:40 PM IST
Highlights

బాధ్యత లేకుండా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ చార్మిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపించాలని హెచ్చార్సీని తెలంగాణ రైట్స్ సొసైటీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ రైట్స్ సొసైటీ దాఖలు చేసింది. 

ఛార్మి కాలక్షేపానికి పెట్టిన వీడియో ఇప్పుడు ఆమెకు సమస్యలు తెచ్చిపెడుతోంది.  ఓ ప్రక్కన కరోనా భయంతో ఎక్కడెక్కడ ప్రజలు ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని  జీవించే పరిస్దితి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఈ వైరస్ దాడికి వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా లక్షల్లో ఈ వ్యాధి బారిన పడి బిక్కుబిక్కుమంటున్న సిట్యువేషన్. ఈ వైరస్ ..ఇప్పటికే దిల్లీ నుంచి హైదరాబాద్ (తెలంగాణ) కరోనా వైరస్ పాకింది అన్న ప్రచారం హోరెత్తిపోతూ అందరినీ భయపెడుతోంది.  ఈ నేఫధ్యంలో ఛార్మి కరోనా పై ఎటకారంగా వీడియో చేసి టిక్ టాక్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

జనాలు చస్తుంటే ఛార్మికి వెటకారం.. కరోనాపై కామెంట్స్

దాంతో కరోనా వైరస్ గురించి బాధ్యత లేకుండా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ చార్మిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపించాలని హెచ్చార్సీని తెలంగాణ రైట్స్ సొసైటీ కోరింది. వ్యాధి సోకిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ రైట్స్ సొసైటీ దాఖలు చేసింది. 
 
కరోనా వచ్చేసిందంట  ఆల్ ది బెస్ట్ అంటూ సంబరపడుతూ ఆమె పోస్ట్ చేసిన  వీడియో పెద్ద స్దాయిలో చర్చనీయాంసమైంది. ఈ వీడియోని చూసిన  నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. సోషల్ మీడియాల్లో చెడా మడా తిట్టి పారేసారు. మరీ అంత భాధ్యత లేకుండా, సిల్లీగా టిక్ టాక్ చేస్తుందా? అని కొందరు బూతులు తిట్టేయడంతో ఆ వీడియోని వెంటనే ఛార్మి తొలగించి క్షమాపణలు తెలిపింది. అయినా ఇప్పుడు కేసు నమోదు చేయమనే డిమాండ్ లు వినిపిస్తున్నాయి.

click me!